News April 3, 2025
ర్యాగింగ్, ఈవ్ టీజింగ్‌కు పాల్పడుతున్నారా: ASF SP

మహిళలు చిన్నపిల్లలకు చట్టాలపై షీ టీం ద్వారా అవగాహన కల్పిస్తున్నారని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. మహిళలు, చిన్నపిల్లల రక్షణ కోసం షీ టీంలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. మహిళలపై ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ పాల్పడినా.. హింసలకు గురైతే జిల్లా షీ టీం లేదా భరోసా సెంటర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు. మహిళలు అన్యాయానికి గురైనప్పుడు భయపడకుండా.. ధైర్యంగా ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News November 7, 2025
తాజా సినీ ముచ్చట్లు

☛ 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అవార్డుల్లో బెస్ట్ డెబ్యూ డైరెక్టర్(ఫీచర్ ఫిల్మ్)గా ‘కమిటీ కుర్రాళ్లు’ డైరెక్టర్ యధు వంశీ నామినేట్
☛ DEC 25న థియేటర్లలోకి మోహన్‌లాల్ ‘వృషభ’ మూవీ
☛ ‘కథనార్-ది వైల్డ్ సోర్సెరర్’ మూవీ నుంచి అనుష్క శెట్టి లుక్ రివీల్. రోజిన్ థామస్ దర్శకుడు. ప్రధాన పాత్రలో మలయాళ నటుడు జయసూర్య
☛ TV యాడ్ కోసం సచిన్ టెండూల్కర్‌ను డైరెక్ట్ చేసిన ‘OG’ డైరెక్టర్ సుజీత్
News November 7, 2025
పరవాడ: మాక్ అసెంబ్లీకి ఎంపికైన పరవాడ విద్యార్థిని

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈనెల 26న అమరావతిలో నిర్వహించనున్న మాక్ అసెంబ్లీకి పరవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న హరిత ఎంపికైంది. అనకాపల్లిలో నిర్వహించిన వక్తృత్వ వ్యాసరచన క్విజ్ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన హరిత మాక్ అసెంబ్లీకి ఎంపికైనట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి మద్దిలి వినోద్ బాబు శుక్రవారం తెలిపారు. హరితకు కళాశాల అధ్యాపకులు అభినందించారు.
News November 7, 2025
తొండూరు: పొలాల్లోనే కుళ్లిపోతున్న ఉల్లి గడ్డలు

తుఫాన్ వల్ల ఉల్లి పంట చేతికి అందకుండా పోతుందని జిల్లాలోని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొండూరు మండలంలో వందల ఎకరాల్లో ఉల్లిగడ్డలు కుళ్లిపోతున్నాయి. ఇనగలూరు గ్రామానికి చెందిన గుజ్జుల గంగయ్య ఉల్లి పంట పీకి గట్లపై గడ్డలు ఆరబెట్టగా, మరి కొంతమంది ఉల్లి గడ్డలు అమ్మేందుకు కలాల్లో ఆరబోశారు. కీలక దశలో రైతు పాలిట వర్షాలు ఆశనిపాతంలా మారాయ్నారు. నష్టపోయిన ఉల్లి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.


