News April 3, 2025
ర్యాగింగ్, ఈవ్ టీజింగ్‌కు పాల్పడుతున్నారా: ASF SP

మహిళలు చిన్నపిల్లలకు చట్టాలపై షీ టీం ద్వారా అవగాహన కల్పిస్తున్నారని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. మహిళలు, చిన్నపిల్లల రక్షణ కోసం షీ టీంలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. మహిళలపై ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ పాల్పడినా.. హింసలకు గురైతే జిల్లా షీ టీం లేదా భరోసా సెంటర్ను సంప్రదించాలని పేర్కొన్నారు. మహిళలు అన్యాయానికి గురైనప్పుడు భయపడకుండా.. ధైర్యంగా ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News July 6, 2025
జగిత్యాల: రైతులకు ముఖ్య గమనిక

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా అర్హత కలిగిన రైతులకు ప్రతి సంవత్సరం రూ.6000 ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ తెలిపారు. ఈ పథకం ప్రయోజనాలు పొందేందుకు రైతులు తమ ఆధార్ నెంబర్‌ను బ్యాంక్ ఖాతాతో లింక్ చేసుకొని ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. రైతులు తక్షణం మీ బ్యాంకులో, స్థానిక వ్యవసాయ విస్తీర్ణ అధికారులను సంప్రదించాలన్నారు.
News July 6, 2025
NRPT: తొలి ఏకాదశికి ముస్తాబైన వైష్ణవ ఆలయాలు

ఆషాఢమాసంలో వచ్చే తొలి ఏకాదశికి వైష్ణవ ఆలయాలను అందంగా తీర్చిదిద్దారు. రంగురంగుల పూలతో అందంగా అలంకరించి సిద్ధమయ్యాయి. ఆదివారం తొలి ఏకాదశి పురస్కరించుకొని నారాయణపేట పట్టణంలోని తిరుమల గుట్ట వెంకటేశ్వర స్వామి ఆలయం, పత్తి బజార్‌లోని బాలాజీ మందిర్, లోకాయపల్లి గోపాల స్వామి ఆలయం, పళ్ల వీధిలో వెలసిన షోడశబాహు లక్ష్మీనరసింహ స్వామి సహిత రాఘవేంద్ర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.
News July 6, 2025
డ్రోన్ యంత్రాలతో ప్రత్యేక గస్తీ: ఎస్పీ

మహిళల భద్రతకు శక్తి దళం ప్రత్యేక గస్తీ నిర్వహిస్తుందని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ అన్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. డ్రోన్ యంత్రాల ద్వారా ఆకతాయిల కదలికలను పసిగడుతున్నామన్నారు. మహిళలకు అత్యవసర పరిస్థితుల్లో నంబర్ :112, 1930, 1098 అలాగే శక్తి టోల్ ఫ్రీ నెంబర్: 7993485111 ఫోన్ చేయాలని సూచించారు.