News August 13, 2024
ర్యాగింగ్ చేయడం నేరం: జగిత్యాల ఎస్పీ
ర్యాగింగ్ చేయడం నేరమని జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. ర్యాగింగ్, సైబర్ మోసాల నివారణపై యువతకు, విద్యార్థులకు దిశా నిర్దేశం చేసే కార్యక్రమంలో భాగంగా సోమవారం పట్టణంలోని పొలాస అగ్రికల్చర్ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రఘు చందర్, అగ్రికల్చర్ కళాశాల డీన్ భారత్ బట్, రూరల్ సీఐ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
Similar News
News September 8, 2024
ఒకే వేదికపై BJP MP బండి, BRS MLA గంగుల
కరీంనగర్ పట్టణంలో శనివారం గణపతి ప్రతిష్ఠాపన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. అయితే ప్రకాష్ గంజ్‌లో గణపతి మొదటి పూజా కార్యక్రమంలో BJP MP, కేంద్ర మంత్రి బండి సంజయ్, BRS MLA గంగుల కమలాకర్, నగర మేయర్ యాదగిరి సునీల్ రావు ఒకే వేదికపై కనిపించారు. ఈ సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
News September 8, 2024
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆదివారం ఆదాయ వివరాలు
సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం రూ.39,906 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.13,900, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.21,700, అన్నదానం రూ.3,306 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.
News September 8, 2024
WOW.. జగిత్యాల జిల్లాలో 52 ఫీట్ల మట్టి గణపతి!
జగిత్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్‌లో సాయిబాబా ఆలయం పక్కన 52 ఫీట్ల మట్టి గణపతిని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన ప్రతిష్ఠాపన పూజలో MLA సంజయ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. 11 రోజుల పూజల అనంతరం మండపం వద్దనే నీళ్లతో వినాయకుని నిమజ్జనం కార్యక్రమం ఉంటుందని తెలిపారు. పెద్దపల్లి, KNRలో భారీ గణపతులను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.