News July 29, 2024

లంక గ్రామాల్లో నేడు స్కూల్స్ బంద్: ప.గో కలెక్టర్

image

ప.గో జిల్లాలో గోదావరి వరద కారణంగా సోమవారం జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ ‘మీకోసం’ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ముంపునకు గురైన లంక గ్రామాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్వాడీలకు సోమవారం సెలవు ప్రకటించినట్లు ఆమె పేర్కొన్నారు. మండల, డివిజన్ స్థాయిలో జరగాల్సిన మీకోసం కార్యక్రమాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News December 22, 2025

విద్యార్థులలో సృజనాత్మకత పెంచేందుకే సైన్స్ పెయిర్లు: కలెక్టర్

image

విద్య, వైజ్ఞానిక ఆవిష్కరణలు విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించడంతోపాటు, దేశ పురోభివృద్ధికి దోహదపడతాయని కలెక్టర్ నాగరాణి అన్నారు. వీరవాసరం జడ్పీ హైస్కూల్లో సోమవారం జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్ ప్రదర్శనను కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్సీ గోపి మూర్తి ప్రారంభించారు. జిల్లాలోని 7 నియోజకవర్గాలకు సంబంధించిన 146 సైన్స్ ఫెయిర్ ప్రదర్శనను పరిశీలించి ప్రాజెక్టు వివరాలను అడిగి తెలుసుకున్నారు.

News December 22, 2025

ప.గో జిల్లాలో యూరియా కొరత లేదు: జేసీ

image

జిల్లాలో యూరియా కొరత లేదని రబీ సీజన్‌కు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి భీమవరంలో తెలిపారు. జిల్లాలో రబీ పంటకు, అన్ని పంటలకు అవసరమైన 36,820 మెట్రిక్ టన్నుల యూరియా ఎరువుల పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది అన్నారు. అక్టోబర్ 1 నాటికి 7,009 మెట్రిక్ టన్నుల యూరియా ప్రారంభ నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

News December 22, 2025

అండర్-19 నేషనల్ క్రికెట్ పోటీలకు భీమవరం విద్యార్థి ఎంపిక

image

ఢిల్లీలో ఈ నెల 24 నుంచి 27 వరకు జరగనున్న అండర్-19 నేషనల్ క్రికెట్ టోర్నమెంట్‌కు భీమవరం విద్యార్థి ఒల్లిపల్లి దుర్గా రాంచరణ్ ఎంపికయ్యాడు. 9వ తరగతి చదువుతున్న రాంచరణ్ ఇప్పటి వరకు 72 మ్యాచ్‌లు ఆడి 46 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లో 139 పరుగుల అత్యధిక స్కోరు సాధించాడు. రాంచరణ్ మరిన్ని విజయాలు సాధించాలని స్థానికులు కోరుతున్నారు.