News February 4, 2025
లంగడీ పోటీల్లో చోద్యం విద్యార్థుల ప్రతిభ

ఇటీవల తమిళనాడులో జరిగిన జాతీయ స్థాయి లంగడీ ఆటల పోటీల్లో గొలుగొండ మండలం చోద్యం విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. 11 మంది ఈ పోటీలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచారని హెచ్ఎం శ్రీనివాసరావు, పీఈటీ నూకరాజు తెలిపారు. మన రాష్ట్రంలో ప్రాచుర్యం లేకపోయినా ఇతర రాష్ట్రాలలో పోటీ పడి గెలుపొందారని చెప్పారు. ఈ మేరకు విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు.
Similar News
News February 25, 2026
అమరావతిలో పర్యటించిన దక్షిణ కొరియా బృందం

జాతీయ యూనివర్సిటీ(దక్షిణ కొరియా) బృందం మంగళవారం అమరావతిలో పర్యటించింది. పర్యటనలో భాగంగా రాయపూడిలోని APCRDA కార్యాలయాన్ని బృందం సందర్శించింది. అమరావతి అభివృద్ధి గురించి CRDA అధికారులు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అమరావతిలో పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధి, టూరిజం ప్రాజెక్టులు, విద్య, పరిశోధన అంశాలలో భాగస్వామ్యాలకు ఉన్న విస్తృత అవకాశాలు, అంశాలపై అధికారులు బృందానికి వివరించారు.
News February 25, 2026
TODAY HEADLINES

*YCP హయాంలో హిందూమతంపై దాడి: CBN
*లడ్డూ తయారీలో 68L కిలోల కల్తీ నెయ్యి వాడారు: Dy.CM పవన్
*AP: దివ్యాంగులకు ఉచిత RTC బస్సు సౌకర్యం: క్యాబినెట్
*నేనూ కుల వివక్షను ఎదుర్కొన్నా: భట్టి
*పోలీసుల ఎదుట లొంగిపోయిన దేవ్జీ.. త్వరలోనే రాజకీయాల్లోకి వస్తానని ప్రకటన
*TG: రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు. 5min లేటైనా అనుమతి
*కేరళను ‘కేరళం’గా మార్చేందుకు కేంద్రం ఆమోదం
News February 25, 2026
ప్రజారోగ్య రక్షణలో ప్రభుత్వం విఫలం: జగన్

AP: శ్రీకాకుళం <<19230296>>డయేరియా<<>> ఘటనపై మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తాగునీటి వనరుల పరిశుభ్రత, క్లోరినేషన్, మురుగునీటి నిర్వహణలో తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజల ఆరోగ్యం కాపాడటంలో ప్రభుత్వం విఫలమైతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.


