News February 18, 2025

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ అటవీ అధికారులు

image

ఇల్లందు మండలం కొమరారం అటవీ రేంజ్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఓ వ్యక్తి నుంచి రూ. 30 వేలు లంచం తీసుకుంటూ రేంజర్ ఉదయ్ కిరణ్, బీట్ అధికారి నునావత్ హరిలాల్ పట్టుబడ్డారు. అటవీ భూమి నుంచి గ్రావెల్ తరలించేందుకు ఓ వ్యక్తిని రూ. 30 వేలు డిమాండ్ చేయగా సదరు కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.

Similar News

News December 5, 2025

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 124 పోస్టులు.. దరఖాస్తు గడువు పొడిగింపు

image

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(<>SAIL<<>>)లో 124 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు గడువును పొడిగించారు. నేటితో అప్లై గడువు ముగియనుండగా.. DEC 15వరకు పొడిగించారు. ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.sail.co.in

News December 5, 2025

పోస్టల్ బ్యాలెట్ అందజేయాలి: అదనపు కలెక్టర్ నగేష్

image

పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క ఎన్నికల సిబ్బందికి తప్పనిసరిగా ఓటింగ్ సౌకర్యం కల్పించాలని అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నోడల్ అధికారులతో సమావేశమై, వారికి కేటాయించిన విధులను సమర్థంగా నిర్వహించేందుకు తగిన సూచనలు, సలహాలు అందించారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు.

News December 5, 2025

‘కొనుగోలు కేంద్రాల్లో లారీలు అందుబాటులో ఉంచాలి’

image

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిలువలకు అనుగుణంగా లారీలు అందుబాటులో ఉండాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు. బోయినపల్లి, కోనరావుపేట మండలాలకు చెందిన కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, లారీల కాంట్రాక్టర్లతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా మండలాల్లో ధాన్యం కొనుగోళ్లు, నిల్వలపై అదనపు కలెక్టర్ ఆరా తీశారు.