News March 25, 2025
లంచం తీసుకుంటూ పట్టుపడ్డ పిఠాపురం రూరల్ ఎస్సై

పిఠాపురం రూరల్ ఎస్సై గుణశేఖర్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. దొంతలూరు గ్రామానికి సంబంధించిన కేసు విషయంలో లంచం అడిగినట్లు ఏసీబీకి ముందస్తు సమాచారం అందింది. దీంతో నిఘా ఉంచిన అధికారులు రూ.20వేలు తీసుకుంటుండగా.. అదుపులోకి తీసుకున్నారు.
Similar News
News December 3, 2025
సిద్దిపేట: ఇద్దరు భార్యలతో కలిసి నామినేషన్

అక్బర్పేట- భూంపల్లి మండలం జంగాపల్లి గ్రామంలో సర్పంచ్ పదవికి ఇద్దరు భార్యలతో కలిసి ఓ నామినేషన్ వేయడం జిల్లాలో సంచలనంగా మారింది. సర్పంచ్ ఓసీ జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో గ్రామస్థులంతా కలిసి వారికి అవకాశం ఇవ్వాలని తీర్మానం చేశారు. దీంతో గతనెల 30న మొదటి భార్య నామినేషన్ వేసిన ఆయన.. స్క్రూటినిలో ఎక్కడ తిరస్కరిస్తారో అన్న భయంతో మంగళవారం రెండో భార్యతో కలిసి మరో నామినేషన్ దాఖలు చేశారు.
News December 3, 2025
యలమంచిలి: జిల్లా ఎక్సైజ్ అధికారిపై మద్యం వ్యాపారుల ఫిర్యాదు.. విచారణ

అనకాపల్లి జిల్లా ఎక్సైజ్ అధికారి వి.సుధీర్పై యలమంచిలికి చెందిన మద్యం వ్యాపారులు లాలం కార్తీక్, కర్రి మహాలక్ష్మీనాయుడు, లాలం శేఖర్ రాష్ట్ర ఎక్సైజ్ కమీషనర్కు ఫిర్యాదు చేశారు. యలమంచిలి పరిధిలో ఒక బార్ లైసెన్స్ కోసం ఒక్కో మద్యం దుకాణం నుంచి రూ.1.20 లక్షలు చొప్పున రూ.26 లక్షలకు పైగా అక్రమంగా బలవంతపు వసూళ్లు చేసినట్టు పేర్కొన్నారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
News December 3, 2025
రేపు రాజమండ్రిలో ఉమ్మడి జిల్లా వాలీబాల్ సెలక్షన్స్

ఉమ్మడి జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ బాలురు, బాలికల వాలీబాల్ ఎంపికలు గురువారం నిర్వహించనున్నట్లు డీఈఓ సలీం భాషా తెలిపారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎంపికలు జరుగుతాయి. 2008 జనవరి 1 తర్వాత జన్మించిన క్రీడాకారులు అర్హులు. క్రీడాకారులు ఆధార్, జనన ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని సూచించారు.


