News March 30, 2025
లంచం తీసుకున్న పిఠాపురం ఎస్ఐ సస్పెండ్

ఇటీవల పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ దొంతమూరు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తుల దగ్గర లంచం తీసుకున్న పిఠాపురం రూరల్ ఎస్సై గుణశేఖర్‌ను సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఈనెల 24న లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డ SI గుణశేఖర్‌ను అదుపులో తీసుకుని విచారణ చేపట్టారు. అప్పటి నుంచి ఆయన రిమాండ్‌లోనే ఉన్నారు. ఈ నేపథ్యం శనివారం రాత్రి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
Similar News
News January 5, 2026
దారుణం.. USలో భారతీయ యువతి హత్య

USAలోని మేరీల్యాండ్‌లో భారతీయ యువతి నిఖిత గొడిశెల(27) దారుణ హత్యకు గురయ్యారు. యువతి కనిపించట్లేదని మాజీ ప్రేమికుడు అర్జున్ JAN 2న పోలీసులకు ఫిర్యాదు చేసి ఆపై INDకు పయనమయ్యారు. 3న అతని అపార్టుమెంటును పరిశీలించగా కత్తిపోట్లకు గురైన యువతి డెడ్‌బాడీ కనిపించింది. DEC 31న అర్జున్ ఆమెను చంపినట్లు భావిస్తున్న పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. అటు యువతి పేరెంట్స్‌ను USలోని భారత ఎంబసీ సంప్రదించింది.
News January 5, 2026
వెనిజులాను US పాలించదు: మార్కో రుబియో

వెనిజులాపై ఆధిపత్యం విషయంలో అమెరికా కాస్త వెనక్కి తగ్గినట్లు కన్పిస్తోంది. ఆ దేశ అధ్యక్షుడు మదురోను US బలగాలు అరెస్ట్ చేసిన తర్వాత వెనిజులాను తమ అధీనంలోకి తీసుకున్నట్లు ట్రంప్ తెలిపారు. ఈ ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే US విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో కీలక వ్యాఖ్యలు చేశారు. వెనిజులాను అమెరికా పాలించదని స్పష్టం చేశారు. అయితే చమురు నిర్బంధం విషయంలో మార్పులకు ఆ దేశంపై ఒత్తిడి తెస్తుందన్నారు.
News January 5, 2026
T20 WCలో భారత్‌కు అతడే కీ ప్లేయర్: డివిలియర్స్

రానున్న T20 WCలో భారత జట్టులో హార్దిక్ పాండ్య కీ ప్లేయర్ అని SA క్రికెట్ దిగ్గజం డివిలియర్స్ అన్నారు. ఏ పరిస్థితుల్లోనైనా అతను బ్యాటింగ్, బౌలింగ్ చేయగలరని కొనియాడారు. పాండ్య జట్టులో ఉండటం కెప్టెన్ సూర్యకు పెద్ద ఆస్తి అని తెలిపారు. హార్దిక్ నాలుగైదు ఓవర్లు క్రీజులో ఉంటే ప్రత్యర్థి జట్టుకు ఓటమి ఖాయమని చెప్పారు. ఇటీవల VHTలో పాండ్య ఒకే ఓవర్లో 5 సిక్సులు బాది విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే.


