News August 20, 2024
లంచగొండి అధికారులు సెలవుపై వెళ్లండి: ఎమ్మెల్యే వరద
ప్రొద్దుటూరు సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని MLA వరదరాజుల రెడ్డి మంగళవారం తనిఖీ చేశారు. లంచగొండి అధికారులు సెలవుపై వెళ్లాలన్నారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న ముగ్గురు సిబ్బంది రిజిస్ట్రేషన్‌కు వచ్చిన వచ్చిన వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని, లంచాల ద్వారా వచ్చిన సొమ్మును రిజిస్టర్ ఆఫీస్ సిబ్బందికి వాటాలు పంచుతున్నారని ఎమ్మెల్యే రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీకి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు.
Similar News
News September 8, 2024
ప్రొద్దుటూరులో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు
ప్రొద్దుటూరు అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్‌లో ఆదివారం బాషా అథ్లెటిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు జరిగాయి. అండర్-18, 20, 23 మహిళలకు, పురుషులకు పరుగు పోటీలు, లాంగ్ జంప్, హైజంప్, షాట్ పుట్, డిస్కస్ త్రో, జావెలిన్ త్రో విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని ఫౌండేషన్ కార్యదర్శి అహ్మర్ బాషా తెలిపారు.
News September 8, 2024
కడప: ఈనెల 10న జాబ్ మేళా
కడప జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఈనెల 10న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సురేశ్ కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ప్రొద్దుటూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, జమ్మలమడుగులోని న్యాక్ కేంద్రంలో జాబ్ మేళా జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News September 8, 2024
కడప: మహిళకు అరుదైన శస్త్రచికిత్స
కడపలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. నీలకంఠరావు పేటకి చెందిన మహిళ గత నాలుగు నెలలుగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతోంది. వైద్యుల్ని సంప్రదించగా పరీక్ష చేసి కడుపులో సుమారు ఫుట్ బాల్ సైజులో రెండు కిలోల పైగా ఉన్న కణితిని గుర్తించారు. ఈ కణితిని కడపలోని ఓ ప్రయివేటు హాస్పిటల్ వైద్యులు శస్త్ర చికిత్స ద్వారా విజయవంతంగా తొలగించారు.