News August 20, 2024

లంచగొండి అధికారులు సెలవుపై వెళ్లండి: ఎమ్మెల్యే వరద

image

ప్రొద్దుటూరు సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని MLA వరదరాజుల రెడ్డి మంగళవారం తనిఖీ చేశారు. లంచగొండి అధికారులు సెలవుపై వెళ్లాలన్నారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న ముగ్గురు సిబ్బంది రిజిస్ట్రేషన్‌కు వచ్చిన వచ్చిన వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని, లంచాల ద్వారా వచ్చిన సొమ్మును రిజిస్టర్ ఆఫీస్ సిబ్బందికి వాటాలు పంచుతున్నారని ఎమ్మెల్యే రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీకి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు.

Similar News

News December 30, 2025

పుష్పగిరిలో అపశ్రుతి.. వైకుంఠ ద్వార దర్శనం రద్దు

image

కడప జిల్లాలోని పుష్పగిరి పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో వైకుంఠ ఉత్తర ద్వార దర్శనాన్ని మంగళవారం తాత్కాలికంగా నిలిపివేశారు. పుష్పగిరి గ్రామ పరిధిలో ఓ వ్యక్తి మృతి చెందడంతో సంప్రదాయ నియమాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆలయ శుద్ధి కార్యక్రమాలు పూర్తిచేసి పూజా కైంకర్యాలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తారని తెలుస్తోంది.

News December 29, 2025

కడప: న్యూ ఇయర్ వేళ బేకరీలపై నిఘా

image

నూతన సంవత్సరం సందర్భంగా కడప నగరంలోని పలు బేకరీలు, కేక్ తయారీ కేంద్రాలపై మున్సిపల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. కమిషనర్ మనోజ్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం హెల్త్ ఆఫీసర్ డా.రమేశ్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ హరిణి కేక్ తయారీ విధానాన్ని పరిశీలించారు. తయారీ కేంద్రాల్లో శుభ్రత, నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని యాజమాన్యాలను హెచ్చరించారు. ఈ తనిఖీల్లో శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.

News December 29, 2025

మారనున్న కడప జిల్లా స్వరూపం

image

రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల పునర్విభజన నేపథ్యంలో కడప జిల్లా స్వరూపం మారనుంది. ప్రస్తుతం 36 మండలాలుగా ఉన్న జిల్లా 40 మండలాలుగా మారనుంది. కొత్తగా అన్నమయ్య జిల్లాలోని రాజంపేట, టి.సుండుపల్లి, వీరబల్లి, నందలూరు మండలాలతో రాజంపేట నియోజకవర్గాన్ని కడప జిల్లాలోని విలీనం చేశారు.