News November 4, 2024
లండన్‌లో పర్యటిస్తున్న జుక్కల్ ఎమ్మెల్యే

తెలంగాణ అధికార పర్యటనలో భాగంగా ఈ నెల 5,6,7 తేదీల్లో జరగనున్న వరల్డ్ ట్రావెల్ మార్కెట్ (WTM)లో పాల్గొనేందుకు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు వెళ్లారు. తెలంగాణ టూరిజాన్ని ప్రమోట్ చేయడం, పర్యాటక రంగంలో పెట్టుబడులే లక్ష్యంగా వారి పర్యటన సాగనుంది. ఈ సందర్భంగా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నాయకులు వీరికి ఘన స్వాగతం పలికారు.
Similar News
News July 8, 2025
NZB: ముగ్గురు ASIలకు SIలుగా పదోన్నతి

నిజామాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో పని చేస్తున్న ముగ్గురు ASIలకు SIలుగా పదోన్నతి కల్పిస్తూ CP సాయి చైతన్య ఉత్తర్వులు జారీ చేశారు. బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న ASI నాగభూషణం, మాక్లూర్ PSలో పని చేస్తున్న నర్సయ్య, NZB త్రీ టౌన్‌లో పని చేస్తున్న లీలా కృష్ణకు SIలుగా పదోన్నతులు కల్పించారు. నాగభూషణం, నర్సయ్యలను నిర్మల్ జిల్లాకు, లీలా కృష్ణను ఆదిలాబాద్ జిల్లాకు బదిలీ చేశారు.
News July 8, 2025
భీమ్‌గల్: 5 నెలల చిన్నారిని హత్య చేసిన తల్లి..?

భీమ్‌గల్ మండలంలో దారుణం జరిగింది. కడుపులో దాచుకోవాల్సిన తల్లి బిడ్డను కడతేర్చింది. తన కూతురిని భార్యే హత్య చేసిందని భర్త ఫిర్యాదు చేసినట్లు SI సందీప్ తెలిపారు. గోనుగొప్పుల వాసి మల్లేశ్- రమ్య దంపతులకు శివాని(5) సంతానం. రమ్య తాగుడుకు బానిసై చిన్నారిని పట్టించుకోవడం లేదు. దీంతో మల్లేశ్ భార్యను పలు మార్లు మందలించాడు. బిడ్డ కారణంగానే గొడవలు జరుగుతున్నాయని భావించిన రమ్య ఈనెల 6న హత్య చేసిందన్నారు.
News July 8, 2025
ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సంబరాలు నిర్వహించాలి: కలెక్టర్

ఈ నెల 10 నుంచి 16 వరకు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సంబరాలను జిల్లాలో పండుగ వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. సోమవారం ఆయన జిల్లా సమాఖ్య సమావేశంలో మాట్లాడుతూ.. విజయోత్సవ సంబరాల సన్నద్ధత, కార్యాచరణ కోసం ఈ నెల 8న అన్ని మండలాలలో మండల సమాఖ్య సమావేశాలు, 9న గ్రామ సంఘాలతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు.