News December 11, 2024

లండన్‌లో బూదవాడకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దుర్మరణం

image

లండన్‌లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చీమకుర్తి మండలం బూదవాడకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పీ చిరంజీవి(32) మృతిచెందారు. అతను కారులో వెళుతుండగా డివైడర్‌ను ఢీకొట్టడంతో అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో చిరంజీవి అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. ఈ విషయం తెలియడంతో అతని తల్లిదండ్రులు, బంధువులు శోకసముద్రంలో మునిగిపోయారు. మృతదేహం ఇండియాకు రావాల్సి ఉంది.

Similar News

News January 13, 2025

మార్కాపురం: దారణ హత్య.. హంతకులు ఎవరంటే?

image

మార్కాపురం మండలం కొత్తపల్లికి చెందిన సుబ్బలక్ష్మమ్మకు 30 ఏళ్ల క్రితం వెంకటేశ్వర్లతో వివాహమైంది. అదే గ్రామానికి చెందిన వెంకటనారాయణతో తన భార్య అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో వెంకటనారాయణను 2005వ సం”లో వెంకటేశ్వర్లు హత్య చేసి 9 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు. కాగా సుబ్బలక్ష్మమ్మ తన పద్ధతి మార్చుకోలేదనే అనుమానంతో వెంకటేశ్వర్లు తన ఇద్దరు తమ్ముళ్లతో కలిసి 4 రోజుల క్రితం భార్యను హత్య చేశాడు.

News January 13, 2025

ప్రకాశం: జిల్లా ప్రజలకు ముఖ్య గమనిక

image

ప్రకాశం జిల్లా కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే “ప్రజా సమస్యల పరిష్కార వేదిక”ను తాత్కాలికంగా రద్దు చేసినట్లు కలెక్టర్ తమిమ్ అన్సారియా ప్రకటన విడుదల చేశారు. సోమవారం భోగి సందర్భంగా తాత్కాలికంగా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. సుదూర ప్రాంతాల నుంచి కలెక్టర్ కార్యాలయానికి వచ్చే అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి సిబ్బందికి సహకరించాలని కోరారు.

News January 13, 2025

ప్రకాశం: భోగి మంట వేస్తున్నారా?

image

సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండుగ సెలబ్రేషన్స్‌ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ రేపు భోగి మంట వేస్తున్నారా? మీసెలబ్రేషన్స్‌‌ను వే2న్యూస్‌లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ 97036 22022కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం.