News January 14, 2025

లండన్‌ పర్యటనలో భద్రతకు అనంతపురం కమాండర్ కావాలి: జగన్

image

YS జగన్ కుటుంబంతో కలిసి లండన్ వెళ్లనున్నారు. ఈనెల 16న జరగనున్న కుమార్తె స్నాతకోత్సవానికి వెళ్లడానికి కోర్టును అనుమతి కోరారు. అయితే లండన్‌లో తనకు సెక్యురిటీగా అనంతపురం APSP బెటాలియన్‌కు చెందిన కమాండెంట్ మహబూబ్‌ను నియమించేలా ఆదేశాలివ్వాలని సోమవారం అత్యవసర హౌస్‌మోషన్ పిటిషన్ వేశారు. దీనిపై హైకోర్టు విచారణ జరిపుతోంది. కాగా తమ వినతిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని అధికారులను YS జగన్ కోరారు.

Similar News

News November 21, 2025

‘అరటి సాగుచేస్తున్న రైతులను ఆదుకోండి’

image

అనంతపురం జిల్లా వ్యాప్తంగా అరటి సాగుచేస్తున్న రైతులను వెంటనే ఆదుకోవాలని CPM నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లిలో శుక్రవారం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాంభూపాల్ రెడ్డి, జిల్లా కార్యదర్శి నల్లప్ప, తదితర నాయకులు అరటి పంటలను పరిశీలించారు. గిట్టుబాటు ధర లేక అరటి సాగుచేస్తున్న రైతులు నష్టపోతున్నారని, వెంటనే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

News November 21, 2025

అనంతపురం మొదటి జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి సంచలన తీర్పు

image

గంజాయి సరఫరా, విక్రయాలకు పాల్పడిన ఐదుగురి ముఠాకు 10 ఏళ్లు జైలు శిక్ష, చెరో రూ.లక్ష జరిమానా విధిస్తూ అనంతపురం మొదటి జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి సంచలన తీర్పు వెలువరించారు. (గంగాధర్, స్వాతి, ప్రసాద్, షేక్ గౌసియా, షేక్ అలీ) నిందితులకు శిక్ష పడేలా కృషిచేసిన అధికారులు, సిబ్బందిని ఎస్పీ జగదీశ్ అభినందించారు. షేక్ అలీ గుంతకల్లు మండలం తిమ్మాపురం గ్రామం కాగా మిగిలిన నలుగురు అనంతపురానికి చెందినవారే.

News November 21, 2025

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు నార్పల విద్యార్థి

image

రాష్ట్రస్థాయి అండర్-14 వాలీబాల్ పొటీలకు నార్పల జడ్పీ బాలికోన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని ఆఫ్రిన్ ఎంపికైనట్లు ప్రదానోపాధ్యాయుడు నాగేశ్ తెలిపారు. స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో డిసెంబర్ 6వ తేదీ నుంచి నెల్లూరులో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థిని పాఠశాల ఉపాధ్యాయులు, పీడీలు అభినందించారు.