News June 22, 2024
లక్కవరపుకోటలో అత్యధిక వర్షపాతం

విజయనగరం జిల్లాలోని లక్కవరపుకోట మండలంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా శుక్రవారం రాత్రి వర్షం కురిసింది. లక్కవరపుకోటలో అత్యధికంగా 57.2 మిల్లీమీటర్లు, నెల్లిమర్లలో 54.8 మిల్లీమీటర్లు, శృంగవరపుకోటలో 40.6 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. జిల్లాలో సరాసరి 15.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు.
Similar News
News November 18, 2025
VZM: వినతులు కుప్పల తెప్పలు.. పరిష్కారం ఏ స్థాయిలో?

ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లో జరుగుతున్న PGRS కార్యక్రమానికి ప్రజల నుంచి వినతులు పోటెత్తున్నాయి. వాటి పరిష్కారం ఏ స్థాయిలో ఉందనేది ప్రశ్నార్ధకంగా మారింది. వినతుల పరిష్కారం అంతంత మాత్రమేనని స్వయంగా అర్జీదారులే ఆరోపిస్తున్న పరిస్థితి. వినతుల పరిష్కారానికి కలెక్టర్ రాంసుందర్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో సిబ్బంది లైట్ తీసుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

విజయనగరంలో ఈనెల 20న జాబ్ మేళా

విజయనగరం MR కాలేజీలో ఈనెల 20న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వహీద సోమవారం తెలిపారు. ఒయాసిస్ ఫెర్టిలిటీ, ATC టైర్స్, మెడ్ ప్లస్ సంస్థలలో కలిపి 195 పోస్టులు భర్తీ చేయనున్నారని, అభ్యర్థులు ముందుగా employment.ap.gov.inలో నమోదు చేసుకుని, సర్టిఫికెట్లు, బయోడేటా, 2 ఫొటోలతో జాబ్ మేళాకు హాజరవ్వాలన్నారు. డిగ్రీ, పీజీ, ANM, GNM, ఫార్మసీ, ఐటీఐ, SSC చదివిన వారు అర్హులుగా పేర్కొన్నారు.