News March 21, 2024

లక్కిరెడ్డిపల్లి: బావిలో దూకి ఆత్మహత్య

image

లక్కిరెడ్డిపల్లె మండలంలోని కస్తూరురాజుగారిపల్లి కస్పాకు చెందిన వంటేరు లక్ష్మీదేవి(27) గురువారం తెల్లవారుజామున బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు పోస్టుమార్టం కొరకు లక్ష్మీదేవి మృతదేహాన్ని లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివాహిత ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.

Similar News

News April 14, 2026

కడప: రేపే ఇంటర్ ఫలితాలు.. 33,664 మంది ఎదురుచూపు

image

ఇంటర్మీడియట్ ఫలితాలు రేపు ఉదయం 10:31 గంటలకు విడుదల కానున్న నేపథ్యంలో కడప జిల్లా విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ ఏడాది 62 కేంద్రాల్లో ప్రథమ సంవత్సరంలో 17100 మంది, ద్వితీయ సంవత్సరంలో 16,564 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల అనంతరం విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారికి ధైర్యం చెప్పాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. ఫలితాలను Way2News యాప్‌లో చూసుకోవచ్చు.

కడప జిల్లాలో బెల్ట్ షాపులపై 47 కేసులు

image

కడప జిల్లా వ్యాప్తంగా మద్యం బెల్ట్ షాపులపై విస్తృతస్థాయిలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఒకేరోజు 47 కేసులు నమోదు చేశారు. 47 మంది నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 579 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. 554 క్వార్టర్ బాటిళ్ల మద్యం, 25 బీర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అనుమతులు లేకుండా అక్రమంగా మద్యం విక్రయాలు జరిపితే చర్యలు తీసుకుంటామని ఎస్పీ విశ్వనాథ్ హెచ్చరించారు.