News October 4, 2024

లక్కీ డ్రా నిర్వాహకులపై కేసు నమోదు: చందుర్తి CI

image

బహమతుల ఆశ చూపెడుతూ లక్కీ డ్రాలు నిర్వహిస్తున్న నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. చందుర్తి మండల కేంద్రంలో ఎలాంటి అనుమతులు లేకుండా దుర్గమ్మ విగ్రహాల వద్ద లయన్స్ యూత్ వారు లక్కీ డ్రా నిర్వహిస్తున్నారన్నారు. ప్రజల వద్ద నుంచి ఒక్కొక్క లక్కీ డ్రా టికెట్ రూ.99 వసూలు చేస్తూ డ్రాలో పాల్గొనాలని ప్రచారం చేస్తున్న వారిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

Similar News

News December 6, 2025

హోంగార్డుల సేవలు అమూల్యం: సీపీ గౌష్ ఆలం

image

63వ హోంగార్డు వ్యవస్థాపక దినోత్సవాన్ని కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీ గౌష్ ఆలం, శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డుల పాత్ర కీలకమని కొనియాడారు. అత్యవసర విధుల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ఆయన ప్రశంసాపత్రాలు అందజేసి సత్కరించారు. క్రీడా పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు పంపిణీ చేశారు.

News December 6, 2025

కరీంనగర్: ఈ నెల 22 వరకూ ఫీజు చెల్లించవచ్చు

image

డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీజీ ప్రథమ, ద్వితీయ, ఎంబీఏ తృతీయ, ద్వితీయ విడత సప్లిమెంటరీ పరీక్షా ఫీజు గడువు ఈనెల 22 వరకు ఉన్నట్లు కరీంనగర్ స్టడీ సెంటర్ కో-ఆర్డినేటర్ ఏం సత్య ప్రకాష్ తెలిపారు. ఫీజును ఆన్లైన్లో చెల్లించవచ్చని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని సూచించారు.

News December 6, 2025

EVMలకు కట్టుదిట్టమైన భద్రత.. వివిధ పార్టీలతో పరిశీలన

image

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోదాంను అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్ శనివారం తనిఖీ చేశారు. ఆర్డీఓ మహేశ్వర్‌తో పాటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ సహా పలు పార్టీల ప్రతినిధులు ఈ పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్లకు ఏర్పాటు చేసిన కట్టుదిట్టమైన భద్రతా చర్యలు, పోలీస్ గార్డుల విధులను ఆమె పర్యవేక్షించారు.