News September 7, 2024
లక్షకు పైగా మెడికల్ కిట్లు పంపిణీ చేశాం: మంత్రి సత్యకుమార్
విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాలలోని 32 వార్డు సచివాలయాల్లో 184 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామని, ఆరు రకాల మందులతో కూడిన లక్షకు పైగా మెడికల్ కిట్లను ఇప్పటికే పంపిణీ చేశామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రానున్న రోజుల్లో ఈ మెడికల్ కిట్లను రాష్ట్రవ్యాప్తంగా కూడా పంపిణీ చేస్తామన్నారు. ఎల్లుండి నుంచి మూడు రోజులపాటు డోర్ టు డోర్ మెడికల్ సర్వే నిర్వహిస్తామని చెప్పారు.
Similar News
News October 16, 2024
ఘంటసాల: ‘దేవాలయాలు, జనావాసాల మధ్య మద్యం షాపు వద్దు’
దేవాలయాలు, జనావాసాల మధ్య మద్యం షాపులు వద్దని ఘంటసాల ఎస్ఐ ప్రతాపరెడ్డికి గ్రామస్థులు మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలోని సంత మార్కెట్ వెనుక భాగంలో షాపును ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు తెలియవచ్చిందన్నారు. ఆ ప్రాంతానికి 100 మీటర్ల లోపే వీరబ్రహ్మేంద్ర స్వామి, పోలేరమ్మ దేవాలయాలు ఉన్నాయన్నారు. ఈ ప్రాంతంలో మద్యం షాపు ఏర్పాటు చేస్తే ఇబ్బంది కలుగుతుందని తెలిపారు.
News October 16, 2024
కృష్ణా జిల్లా TODAY TOP NEWS
* కృష్ణా నదీ తీరంలో ఈ నెల 22న భారీ డ్రోన్ షో
* విజయవాడలో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
* కృష్ణా: అధికారుల పనితీరుపై కలెక్టర్ ఆగ్రహం
* నందిగామ: తుఫాను హెచ్చరికలు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు
* కృష్ణా జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా వాసంశెట్టి సుభాశ్
* బహిరంగ చర్చకు సిద్ధమా జగన్?: మంత్రి రవీంద్ర
* కృష్ణా: భార్యా భర్తలకు 9 మద్యం షాపులు
* కంచికర్ల: రైసు మిల్లుపై మంత్రి నాదెండ్ల మెరుపుదాడి
News October 15, 2024
కృష్ణానది తీరంలో 22న భారీ డ్రోన్ షో
కృష్ణా నది తీరంలో 22న నిర్వహించే భారీస్థాయి డ్రోన్‌షో, లేజర్ షో ఏర్పాట్లకు పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి సురేష్ కుమార్, జిల్లా కలెక్టర్ సృజన వివిధ శాఖల అధికారులతో కలిసి పున్నమీ ఘాట్ వద్ద క్షేత్రస్థాయిలో పర్యటించారు. రాష్ట్రాన్ని డ్రోన్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దే ఈ కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పాల్గొననున్నట్లు తెలిపారు.