News March 20, 2025
లక్షటిపేట: చేపల వేట.. మత్స్యకారుడి మృతి

లక్షటిపేట మున్సిపాలిటీలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన మేడి లింగయ్య 65 మత్స్యకారుడు మృతి చెందినట్లు ఎస్ఐ సతీశ్ తెలిపారు. మృతుడు చేపలు పట్టుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. రోజులాగే చేపల వేటకు గోదావరికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు వెతకగా ఒడ్డున చనిపోయి ఉన్నాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 12, 2025
ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ధరలు ఇలా!

ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటాళ్లలో.. పత్తి కనిష్ఠ ధర రూ.4,161, గరిష్ఠ రూ.7,679 పలికింది. వేరుశనగ కనిష్ఠ ధర రూ.3,679, గరిష్ఠ ధర రూ.6,540 వరకు నమోదైంది. ఆముదాలు కనిష్ఠంగా రూ.5,693, గరిష్ఠంగా రూ.6,084 వరకు అమ్ముడయ్యాయి. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం చూపుతూ పంటలు కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News December 12, 2025
WNP: రెండో విడత ఎన్నికల ప్రచారానికి నేటితో ముగింపు

వనపర్తి జిల్లాలో ఈనెల 14న రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఆయా మండలాల్లో ఈరోజు సాయంత్రం ఐదు గంటల తర్వాత ఎటువంటి ప్రచారం నిర్వహించడానికి అనుమతి లేదని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ఎన్నికలు జరిగే వనపర్తి, కొత్తకోట, మదనాపూర్, ఆత్మకూరు, అమరచింత 5 మండలాల పరిధిలో నేటి సాయంత్రం 5 గ. వరకు మాత్రమే అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముగించాలని స్పష్టం చేశారు
News December 12, 2025
ఫోన్ నంబర్ల బోర్డులు పెట్టండి: చిత్తూరు కలెక్టర్

చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. రోడ్డు భద్రతా కమిటీ సమావేశం కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించారు. బ్లాక్ స్పాట్లను గుర్తించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆ ప్రదేశాల్లో ఆసుపత్రులు, డాక్టర్ల ఫోను నెంబర్ల వివరాలు తెలిపే బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. వివిధ హైవేల్లో చేపట్టాల్సిన చర్యలను వివరించారు.


