News March 20, 2025
లక్షటిపేట: చేపల వేట.. మత్స్యకారుడి మృతి

లక్షటిపేట మున్సిపాలిటీలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన మేడి లింగయ్య 65 మత్స్యకారుడు మృతి చెందినట్లు ఎస్ఐ సతీశ్ తెలిపారు. మృతుడు చేపలు పట్టుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. రోజులాగే చేపల వేటకు గోదావరికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు వెతకగా ఒడ్డున చనిపోయి ఉన్నాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 21, 2025
IPL: ఇవాళ కీలక పోరు

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఇవాళ GT, KKR మధ్య మ్యాచ్ జరగనుంది. 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో టేబుల్ టాపర్‌గా ఉన్న గుజరాత్ తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు ఏడింట్లో 3 గెలిచి ఏడో స్థానంలో ఉన్న కోల్‌కతా ప్లేఆఫ్స్ వెళ్లాలంటే ఈ మ్యాచ్ కీలకం కానుంది. ఇరు జట్లు ఇప్పటివరకు 4 సార్లు తలపడగా GT 2, KKR ఒక మ్యాచ్‌లో గెలుపొందాయి. ఒకటి రద్దైంది. ఇవాళ ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.
News April 21, 2025
MNCL జిల్లాలో విషాదం.. యువరైతు ఆత్మహత్య

పంట దిగుబడి వస్తుందో.. రాదోనని కలత చెంది రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన జైపూర్ మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీధర్ కథనం ప్రకారం.. పౌనుర్‌కు చెందిన యువ రైతు కుమార్(29)తన ఎకరం పొలంతో పాటు మరో ఎకరం కౌలుకు తీసుకొని మేలు ఫిమేల్ సీడ్ వరి వేశాడు. బోరు ఎండి నీరు అందక ఆవేదన చెందాడు. 3 ఏళ్లుగా పంట సాగులో నష్టాలను చవిచూస్తున్న కుమార్ ఆందోళనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు.
News April 21, 2025
ఒకేసారి APPSC, DSC పరీక్షలు.. అభ్యర్థుల్లో ఆందోళన

AP: మెగా డీఎస్సీ పరీక్షలు జూన్ 6 నుంచి జులై 6 వరకు జరగనుండగా అదే సమయంలో ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. దీంతో రెండింటికీ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. జూన్ 16 నుంచి 26 వరకు పాలిటెక్నిక్, జూ.లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్ల భర్తీకి పరీక్షలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఆయా తేదీల్లో మార్పు చేయాలని పలువురు అభ్యర్థులు కోరుతున్నారు.