News February 16, 2025

లక్షెట్టిపేటలో భార్యను హత్య చేసిన భర్త

image

భార్యను భర్త దారుణంగా హత్య చేసిన ఘటన లక్షెట్టిపేటలో జరిగింది. SI సతీశ్ వివరాల ప్రకారం.. గోదావరి రోడ్డుకు చెందిన గణేశ్ తన భార్య రాజ కుమారిని సిమెంటు ఇటుక, బండరాయితో కొట్టి చంపాడు. కాగా కొద్ది రోజులుగా గణేశ్ మద్యం తాగి వచ్చి భార్యకు ఇతరులతో వివాహేతర సంబంధం ఉందని గొడవ పడేవాడన్నారు. ఆమె ఆదివారం తెల్లవారుజామున బాత్రూమ్‌కు వెళ్ళగా గణేశ్ వెనకాలే వెళ్లి తలపై కొట్టి చంపాడని ఎస్ఐ వెల్లడించారు.

Similar News

News March 14, 2025

రన్యా రావుకు బెయిల్ నిరాకరణ

image

<<15652905>>బంగారం స్మగ్లింగ్ కేసులో <<>>అరెస్టైన కన్నడ నటి రన్యారావు బెయిల్ పిటిషన్‌ను బెంగళూరు ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. ఆమెపై నమోదైన కేసులు చాలా తీవ్రమైనవంటూ DRI న్యాయవాది చేసిన వాదనలతో ఏకీభవించింది. ఈ కేసులో పలువురు బడాబాబులు ఆమె వెనుక ఉన్నారన్న అనుమానాలున్నాయి. దీంతో రన్యా ఎవరి పేరు చెబుతారోనని బ్యూరోక్రాట్లు, బడా రాజకీయ నేతల్లో గుబులు నెలకొన్నట్లు కర్ణాటక రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

News March 14, 2025

KMR: హోలీ పండుగ ఈ ప్రాంతాల్లో ప్రత్యేక ఇదే..!

image

హోలీ అంటేనే రంగులు.. కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గంతో పాటు జిల్లా సరిహద్దైనా కంగ్టి ప్రాంతాల్లో రంగుల పండుగతో పాటు ఒక ప్రత్యేక సంప్రదాయానికి విశేష ప్రాధాన్యం ఉంది. మేన మమాలు తమ మేనల్లులకు, మేన కోడళ్లకు కుడక ఖర్జూర, బత్తిస హారాలు (చక్కెరతో చేసినవి) బహుమతిగా అందించడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. మరి మీ ప్రాంతాల్లో ఈ అనవాయితీ ఉందా.. కామెంట్‌లో తెలపండి.

News March 14, 2025

‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ వదిలేస్తున్నారా? బచ్చన్ ఏమన్నారంటే..

image

టీవీ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ని అమితాబ్ బచ్చన్ వదిలేస్తున్నారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం నడుస్తోంది. దానిపై 16వ సీజన్ చివరి ఎపిసోడ్‌లో బచ్చన్ క్లారిటీ ఇచ్చేశారు. ‘హోస్ట్‌గా ఆడియన్స్ నుంచి నాకు చాలా మద్దతు లభించింది. వచ్చే సీజన్‌లో మిమ్మల్ని మళ్లీ కలుస్తాను. మీ కష్టాన్ని నమ్ముకోండి. కలల్ని సజీవంగా ఉంచుకోండి’ అని ముగించారు. మళ్లీ బచ్చనే ఉంటారని తెలియడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు.

error: Content is protected !!