News February 16, 2025
లక్షెట్టిపేటలో భార్యను హత్య చేసిన భర్త

భార్యను భర్త దారుణంగా హత్య చేసిన ఘటన లక్షెట్టిపేటలో జరిగింది. SI సతీశ్ వివరాల ప్రకారం.. గోదావరి రోడ్డుకు చెందిన గణేశ్ తన భార్య రాజ కుమారిని సిమెంటు ఇటుక, బండరాయితో కొట్టి చంపాడు. కాగా కొద్ది రోజులుగా గణేశ్ మద్యం తాగి వచ్చి భార్యకు ఇతరులతో వివాహేతర సంబంధం ఉందని గొడవ పడేవాడన్నారు. ఆమె ఆదివారం తెల్లవారుజామున బాత్రూమ్‌కు వెళ్ళగా గణేశ్ వెనకాలే వెళ్లి తలపై కొట్టి చంపాడని ఎస్ఐ వెల్లడించారు.
Similar News
News November 10, 2025
12 నుంచి MGMలో స్పెషల్ సదరం క్యాంపు

ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు MGMలో స్పెషల్ సదరం క్యాంపులు నిర్వహించనున్నట్లు హన్మకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. ఇందుకు అర్హులైన వారు ఆన్ లైన్‌లో మీసేవ కేంద్రాల ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. స్లాట్ బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు.
News November 10, 2025
తక్షణ సాయంగా ₹901 కోట్లు ఇవ్వండి: AP

AP: మొంథా తుఫాను నష్టంపై అంచనా వేయడానికి వచ్చిన కేంద్ర బృందం సచివాలయంలో సమీక్ష నిర్వహించింది. ₹6384CR నష్టం వాటిల్లిందని, ₹901.4 కోట్లు తక్షణ సాయంగా అందించాలని రాష్ట్ర అధికారులు కోరారు. 1.61 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు చెప్పారు. ఉద్యాన, మల్బరీ తోటలూ దెబ్బతిన్నాయని వివరించారు. 4,794KM రోడ్లు, 3,437 మైనర్ ఇరిగేషన్ పనులు, 2,417 ఇతర ప్రాజెక్టులకు నష్టం వాటిల్లిందని తెలిపారు.
News November 10, 2025
KMR: కలెక్టరేట్‌లో ప్రజావాణికి 80 అర్జీలు

కామారెడ్డి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’కి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల ద్వారా 80 దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్, అర్జీదారుల సమస్యలను ఓపికగా విన్నారు. అనంతరం ఆయన సంబంధిత జిల్లా అధికారులకు దరఖాస్తులను అందజేశారు. వాటిని తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. పరిధిలో పరిష్కరించలేని సమస్యలపై దరఖాస్తుదారులకు సూచనలు ఇవ్వాలని సూచించారు.


