News February 16, 2025
లక్షెట్టిపేటలో భార్యను హత్య చేసిన భర్త

భార్యను భర్త దారుణంగా హత్య చేసిన ఘటన లక్షెట్టిపేటలో జరిగింది. SI సతీశ్ వివరాల ప్రకారం.. గోదావరి రోడ్డుకు చెందిన గణేశ్ తన భార్య రాజ కుమారిని సిమెంటు ఇటుక, బండరాయితో కొట్టి చంపాడు. కాగా కొద్ది రోజులుగా గణేశ్ మద్యం తాగి వచ్చి భార్యకు ఇతరులతో వివాహేతర సంబంధం ఉందని గొడవ పడేవాడన్నారు. ఆమె ఆదివారం తెల్లవారుజామున బాత్రూమ్‌కు వెళ్ళగా గణేశ్ వెనకాలే వెళ్లి తలపై కొట్టి చంపాడని ఎస్ఐ వెల్లడించారు.
Similar News
News April 16, 2026
సూర్యాపేట: ఆచరించి.. ఆదర్శంగా నిలిచారు

రోడ్డు భద్రత కేవలం నినాదాలకే పరిమితం కాదని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహ ఆచరించి చూపారు. గురువారం నిర్వహించిన ‘ఆరైవ్ అలైవ్’ కార్యక్రమంలో పాల్గొన్న వారు, తిరుగు ప్రయాణంలో తమ కారు ఎక్కగానే స్వయంగా సీట్ బెల్ట్ ధరించి అందరినీ ఆకట్టుకున్నారు. ప్రమాద సమయాల్లో సీట్ బెల్ట్ ప్రాణరక్షక కవచంలా పనిచేస్తుందని, ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.
News April 16, 2026
ఏలూరు: మత్స్య సాగు శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

ఉంగుటూరు మండలం బాదంపూడిలోని దేశీయ జల మత్స్య సంవర్ధన శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందేందుకు ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 23లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మత్స్యశాఖ అధికారి రాజ్‌కుమార్ తెలిపారు. మత్స్యకారులు, యువకులు, సహకార సంఘాల సభ్యులు, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారు అర్హులని పేర్కొన్నారు. ఉపకార వేతనం లేకుండా 20 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.
News April 16, 2026
భూపాలపల్లి: ఆర్భాటం అదిరింది.. ఆచరణ కొరవడింది..!

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా సంక్షేమ శాఖాధికారిణి మల్లిశ్వరి ఎంతో <<19434820>>ఆర్భాటంగా ప్రకటించిన<<>> ‘సెల్ఫీ విత్ డాటర్’ కార్యక్రమం ప్రస్తుతం అడ్రస్ లేకుండా పోయిందనే ఆరోపణలు వస్తున్నాయి. సెల్ఫీలు పంపాలని గడువు విధించారు కానీ ఆ గడువు ముగిసి రోజులు గడుస్తున్నా ఫలితాల ఊసే లేదు. తమ కుమార్తెలతో కలిసి ఎంతో ఉత్సాహంగా ఫొటోలు పంపి బహుమతుల కోసం వేచి చూస్తున్న తల్లిదండ్రులకు ఎటువంటి సమాచారం అందడంలేదు.


