News December 1, 2024

లక్షెట్టిపేటలో సీఎం ప్రసంగాన్ని విన్న ఎమ్మెల్యే, కలెక్టర్

image

లక్షెటిపేటలోని రైతు వేదికలో శనివారం ఎమ్మెల్యే, కలెక్టర్ రైతు పండగ సందర్భంగా సీఎం ప్రసంగాన్ని వీక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి రైతులను ఉద్దేశించి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రసంగించారు. కాగా ఆ ప్రసంగాన్ని వర్చువల్‌గా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, కలెక్టర్ కుమార్ దీపక్ మండల అధికారులు, రైతులతో కలిసి వీక్షించారు. 

Similar News

News December 11, 2024

తాండూరు: గడ్డి మందు తాగి నలుగురు ఆత్మహత్య

image

తాండూరు మండలం కాసిపేటకి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు SI కిరణ్ కుమార్ వెల్లడించారు. ఆయన వివరాల ప్రకారం.. శివప్రసాద్ అనే వ్యక్తి ఆన్లైన్ ట్రేడింగ్ చేసేవాడు. అందులో నష్టాలు రావడంతో అప్పులు తీర్చలేక తన కుటుంబ సభ్యులు తండ్రి మొండయ్య, తల్లి శ్రీదేవి, అక్క చైతన్యతో కలిసి గడ్డి మందు తాగాడు. వరంగల్ MGMలో చికిత్స పొందుతూ మరణించారని ఎస్సై వివరించారు.

News December 11, 2024

మంచిర్యాల: కుటుంబంలో ముగ్గురు మృతి

image

కుటుంబం మొత్తం ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటనలో చికిత్స పొందుతున్న ముగ్గురు బుధవారం ఉదయం మృతి చెందారు. తాండూరు మండలం కాసిపేటకు చెందిన మొండయ్య కుటుంబీకులు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మొండయ్య, అతడి కుమార్తె చైతన్య(30) ఇవాళ ఉదయం మృతి చెందగా.. కొద్దిసేపటి క్రితమే అతడి భార్య శ్రీదేవి కూడా మృతి చెందింది. కుమారుడు శివప్రసాద్(26) పరిస్థితి విషమంగా ఉంది.

News December 11, 2024

మంచిర్యాల: చికిత్స పొందుతున్న తండ్రి, కుమార్తె మృతి

image

మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. తాండూరు మండలం కాసిపేట గ్రామానికి చెందిన ఓ కుటుంబం మంగళవారం పురుగు మందు తాగి <<14839477>>ఆత్మహత్యాయత్నం<<>> చేసుకున్నారు. జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మొండయ్య(60), అతడి కుమార్తె చైతన్య(30) మృతి చెందారు. భార్య శ్రీదేవి(50), కుమారుడు శివ ప్రసాద్(26) పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.