News February 20, 2025

లక్షెట్టిపేట: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

image

లక్షెట్టిపేట మండలం హనుమంతుపల్లికి చెందిన నస్పూరి గౌరయ్య(49) స్లాబ్ రాడ్డుకు నైలాన్ తాడుతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై సతీశ్ తెలిపారు. గౌరయ్య ముంబైలో కూలి పనిచేసి సంవత్సరం క్రితం గ్రామానికి వచ్చి కూతురు పెళ్లి చేసి ఇల్లు కట్టుకున్నాడు. వాటికోసం సుమారు రూ.5 లక్షలు అప్పు చేశాడన్నారు. అప్పులు తీర్చడం భారమై గౌరయ్య ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని, కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Similar News

News November 13, 2025

డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

image

ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనలో డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు ఈ నెల 20లోగా దరఖాస్తు చేసుకోవాలని DTO దేవిశెట్టి శ్రీనివాసరావు గురువారం తెలిపారు. నైపుణ్యంతో కూడిన డ్రైవింగ్ స్కిల్స్ అభివృద్ధి చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయంతో డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడమే దీని ఉద్దేశ్యమన్నారు. 10 లక్షల జనాభాకు ఒక డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ మంజూరు చేశారన్నారు.

News November 13, 2025

నేవీకి అవసరమైన భూమి ఇచ్చేందుకు సిద్ధం: సీఎం

image

విశాఖను దేశంలోనే బెస్ట్ టూరిజం డెస్టినేషన్‌గా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. సీఐఐ సమ్మిట్ సందర్భంగా ఈస్ట్రన్ నావల్ కమాండింగ్ ఇన్‌చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా సీఎంతో భేటీ అయ్యారు. రక్షణ రంగానికి సేవలు అందించే కంపెనీలు, స్టార్టప్‌లను ఆహ్వానించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. నేవీ కార్యకలాపాలకు అవసరమైన భూమిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

News November 13, 2025

భారత్, అఫ్గానిస్థాన్‌తో యుద్ధానికి సిద్ధం: పాకిస్థాన్

image

భారత్, అఫ్గానిస్థాన్‌తో ప్రత్యక్ష యుద్ధానికి రెడీగా ఉన్నామని పాకిస్థాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ తెలిపారు. ఇస్లామాబాద్‌లో మంగళవారం జరిగిన సూసైడ్ బాంబ్ బ్లాస్ట్‌లో 12 మంది మరణించగా 36 మంది గాయపడ్డారు. దాడి చేసింది తామేనని పాకిస్థానీ తాలిబన్ (TTP) ప్రకటించుకున్న తర్వాత ఆసిఫ్ చేసిన కామెంట్లు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. భారత మద్దతుతోనే దాడి జరిగిందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆరోపిస్తున్నారు.