News March 10, 2025
లక్షెట్టిపేట: కూల్ డ్రింక్ మూత మింగి చిన్నారి మృతి

మంచిర్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. లక్షెట్టిపేట మండలంలోని ఊట్కూర్కు చెందిన సురేందర్ కుమారుడు రుద్ర అయాన్ (9నెలలు) కూల్ డ్రింక్ మూత మింగి మృతిచెందినట్లు SI సతీశ్ తెలిపారు. సురేందర్ కుటుంబసమేతంగా ఆదివారం కొమ్ముగూడెంలోని ఓ శుభ కార్యానికి హాజరయ్యారు. అక్కడ రుద్ర అయాన్ ప్రమాదవశాత్తు ఓ కూల్ డ్రింక్ మూత మింగాడు. గమనించిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందాడు.
Similar News
News December 1, 2025
దూడల్లో నట్టల బెడద – తీసుకోవాల్సిన జాగ్రత్తలు

దూడలకు నట్టల బెడద సర్వసాధారణం. ఈ సమస్య గేదె దూడలలో ఎక్కువగా వస్తుంది. దూడల్లో నట్టల సమస్య ఉంటే వాటికి తరచూ విరేచనాలు అయ్యి దూడ పెరుగుదల సక్రమంగా ఉండదు. వెంట్రుకలు బిరుసుగా ఉండి, నడుము కిందికి జారి ఉంటుంది. దవడల మధ్య నీరు చేరుతుంది. ఈ సమస్య కట్టడికి దూడ పుట్టిన ఎనిమిది రోజులలో తొలిసారి, తర్వాత ప్రతి నెలకు ఒకసారి చొప్పున ఆరు నెలల వయసు వచ్చేవరకు వెటర్నరీ నిపుణుల సూచనలతో నట్టల మందు తాగించాలి.
News December 1, 2025
NGKL:డాక్టర్ వెంకటదాస్ సేవలు మరువలేనివి

NGKL డివిజన్ డిప్యూటీ DMHOగా పనిచేసిన డాక్టర్ ఎం.వెంకటదాస్ సివిల్ సర్జన్ RMO పదోన్నతితో జోగులాంబ గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి బదిలీపై వెళ్తుండడంతో, కలెక్టర్ బదావత్ సంతోష్ ఆయనను సత్కరించారు. ఆరోగ్య సూచికలు మెరుగుపరిచేందుకు వెంకటదాస్ సేవలు విశిష్టమైన DMHO డాక్టర్ రవికుమార్ పేర్కొన్నారు. జాతీయ ఆరోగ్య కార్యాచరణలో జిల్లా ముందంజలో ఉండడానికి ఆయన మార్గదర్శకత్వం ఎంతో విలువైందని అన్నారు.
News December 1, 2025
పదేళ్లలో రెట్టింపైన విదేశీ అప్పు: లోక్సభ

మన దేశ అప్పు ఊహించని విధంగా పెరుగుతూ పోతోంది. గత పదేళ్ల దేశ ఆర్థిక వ్యవస్థ, అప్పులపై లోక్సభలో వెల్లడించిన లెక్కలు దేశవ్యాప్త చర్చకు దారితీశాయి. RBI ప్రకారం భారత విదేశీ రుణం దాదాపు రెట్టింపు అయ్యింది. 2015లో దేశ విదేశీ అప్పు రూ. 29,71,542 కోట్లుగా ఉంటే, 2025 జూన్ నాటికి అది రూ. 63,94,246 కోట్లకు చేరింది. అప్పులు పెరిగితే నిత్యావసరాల ధరలు పెరిగి, సామాన్యుడి జీవన వ్యయం భారమవనుంది.


