News March 10, 2025
లక్షెట్టిపేట: కూల్ డ్రింక్ మూత మింగి చిన్నారి మృతి

మంచిర్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. లక్షెట్టిపేట మండలంలోని ఊట్కూర్‌కు చెందిన సురేందర్ కుమారుడు రుద్ర అయాన్ (9నెలలు) కూల్ డ్రింక్ మూత మింగి మృతిచెందినట్లు SI సతీశ్ తెలిపారు. సురేందర్ కుటుంబసమేతంగా ఆదివారం కొమ్ముగూడెంలోని ఓ శుభ కార్యానికి హాజరయ్యారు. అక్కడ రుద్ర అయాన్ ప్రమాదవశాత్తు ఓ కూల్ డ్రింక్ మూత మింగాడు. గమనించిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందాడు.
Similar News
News October 29, 2025
రేపటి నుంచి పాఠశాలలు యథాతదం: డీఈవో

ఏలూరు జిల్లాలో తుఫాను ప్రభావం తగ్గిన నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు గురువారం నుంచి యథాతథంగా కొనసాగనున్నట్లు డీఈవో వెంకటలక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. తుఫాను కారణంగా పాఠశాల ప్రాంగణాలు దెబ్బతినలేదని స్పష్టత తీసుకున్న తర్వాతే విద్యార్థులను లోపలికి అనుమతించాలని డీఈవో సూచించారు. ఈ మేరకు బుధవారం రాత్రి పత్రికా ప్రకటన విడుదల చేశారు.
News October 29, 2025
KNR కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

తుఫాన్ నేపథ్యంలో కరీంనగర్ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. వర్షాల నేపథ్యంలో సహాయం కోసం 0878 2997247కు కాల్ చేయాలన్నారు. భారీ వర్షాలు వల్ల ఇబ్బందులు తలెత్తకుండా అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
News October 29, 2025
అనకాపల్లి జిల్లాలో రేపు పాఠశాలలకు సెలవు

భారీ వర్షాలు పడే అవకాశమున్నందున అనకాపల్లి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ విజయ్ కృష్ణన్ బుధవారం తెలిపారు. విద్యార్థులు అనవసరంగా ఇల్లు దాటి బయటకురావద్దన్నారు. అధికారుల సూచనలు పాటించాలన్నారు. ఏ పాఠశాలైనా తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హచ్చరించారు. పాఠశాలల పరిశుభ్రత, క్లోరినేషన్స్ దృష్టిసారించాలన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.


