News March 5, 2025

లక్షెట్టిపేట: గోదావరిలో మునిగి వ్యక్తి మృతి

image

లక్షెట్టిపేట పట్టణం ముల్కల్లగూడెంనకు చెందిన ముల్కల్ల సత్యనారాయణ(44) ఈత రాక ప్రమాదవశాత్తు గోదావరి నీటిలో మునిగి మృతి చెందాడని ఎస్సై సతీష్ తెలిపారు. మంగళవారం ఉదయం సత్యనారాయణ గోదావరిలో స్నానానికి వెళ్లి నీటిలో మునిగి చనిపోయాడన్నారు. భార్య సుమలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా సత్యనారాయణ కాగజనగర్ ఎస్సీ వసతి గృహంలో వాచ్మెన్‌గా పనిచేస్తున్నాడని SI తెలిపారు.

Similar News

News December 5, 2025

పాలమూరు: CM సొంతూరు ఉప సర్పంచ్ ఈయనే..!

image

వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామ ఉపసర్పంచ్ ఎన్నిక గురువారం ఏకగ్రీవంగా జరిగింది. ఎన్నిక సమావేశానికి హాజరైన పదిమంది వార్డు మెంబర్లు వేమారెడ్డిని ఉపసర్పంచ్‌గా ఎన్నుకున్నారు. రిటర్నింగ్ అధికారి జంగయ్య ఆయనకు నియామకపత్రాన్ని అందజేశారు. వేమారెడ్డి ఉపసర్పంచ్ కావడం మూడోసారి. ఇటీవల సర్పంచ్‌గా వెంకటయ్యను ఎన్నుకున్న విషయం తెలిసిందే. అందరూ ప్రమాణ స్వీకారం చేశారు.

News December 5, 2025

నర్సంపేట: భారీ పోలీస్ బందోబస్తు నడుమ CM పర్యటన

image

సీఎం రేవంత్ రెడ్డి నేడు నర్సంపేటకు రానుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం 575 మందికి పైగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో డీసీపీలతో పాటు, ఏసీపీలు, సీఐలు, ఎస్సై, ఆర్ఐ, డిస్ట్రిక్ట్ గార్డ్స్, బాంబ్ డిస్పోజల్, ట్రాఫిక్ పోలీసులు, ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోం గార్డ్స్ ఉన్నారు.

News December 5, 2025

రైతన్నా.. ఈ పురుగుతో జాగ్రత్త

image

ఖరీఫ్ పంట కోతలు, రబీ పంట నాట్ల వేళ ఏపీ వ్యాప్తంగా 800కు పైగా స్క్రబ్‌టైఫస్ కేసులు నమోదవ్వడం కలవరపెడుతోంది. చిగ్గర్ అనే పురుగు కాటుకు గురైనవారు తీవ్రజ్వరం, ఒంటి నొప్పులు, వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిపాలవుతున్నారు. పొలాలు, అడవులు, తడి నేల, పశువుల మేత ప్రాంతాల్లో పని చేసేవారికి ఈ పురుగుకాటు ముప్పు ఎక్కువగా ఉంది. స్క్రబ్ టైఫస్ లక్షణాలు, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.