News March 5, 2025

లక్షెట్టిపేట: గోదావరిలో మునిగి వ్యక్తి మృతి

image

లక్షెట్టిపేట పట్టణం ముల్కల్లగూడెంనకు చెందిన ముల్కల్ల సత్యనారాయణ(44) ఈత రాక ప్రమాదవశాత్తు గోదావరి నీటిలో మునిగి మృతి చెందాడని ఎస్సై సతీష్ తెలిపారు. మంగళవారం ఉదయం సత్యనారాయణ గోదావరిలో స్నానానికి వెళ్లి నీటిలో మునిగి చనిపోయాడన్నారు. భార్య సుమలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా సత్యనారాయణ కాగజనగర్ ఎస్సీ వసతి గృహంలో వాచ్మెన్‌గా పనిచేస్తున్నాడని SI తెలిపారు.

Similar News

News March 24, 2025

నిర్మల్‌లో BJP X కాంగ్రెస్

image

నిర్మల్ జిల్లాలో రాజకీయాలు BJP X కాంగ్రెస్ అన్నట్లే నడుస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 3 నియోజకవర్గాల్లో BRSఓటమి పాలైంది. నిర్మల్, ముధోల్ మాజీ MLAలు IKరెడ్డి, విఠల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో ఆ పార్టీకి పట్టుపెరిగింది. 2MLA స్థానాలను కైవసం చేసుకున్న BJP బలంగా ఉంది. ఖానాపూర్‌లో కాంగ్రెస్MLA బొజ్జు ప్రజల్లోకి వెళ్తుండగా BRSఇన్‌ఛార్జ్ జాన్సన్‌నాయక్ అప్పుడప్పుడే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

News March 24, 2025

MBNR: సీఎం రేవంత్ రెడ్డిని అభినందిస్తున్నాను: మాజీ ఎంపీ

image

10,950 జీపీవో పోస్టులను నియమించినందుకు, వీఆర్వో, వీఆర్ఎల్‌ను కూడా క్రమబద్ధీకరించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని మహబూబ్‌నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. అలాగే కోచ్‌ల పోస్టులను క్రమబద్ధీకరించడం, కొత్త కోచ్‌ల నియామకం కూడా త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి వేస్తారని ఆశిస్తున్నానన్నారు.

News March 24, 2025

HYD MMTSలో యువతిపై అత్యాచారయత్నం

image

సికింద్రాబాద్ TO మేడ్చల్ MMTSలో ఓ యువతిపై దుండగుడు అత్యాచారానికి యత్నించాడు. యువతి ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెపై అత్యాచారానికి యత్నించగా.. కదులుతున్న ట్రెయిన్‌లో నుంచి ఆ యువతి దూకేసింది. తీవ్రగాయాలైన ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!