News February 23, 2025
లక్షెట్టిపేట: దరఖాస్తుల స్వీకరణ

లక్షెట్టిపేట పట్టణంలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సుల కోసం దరఖాస్తులు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ మహాత్మా సంతోష్ తెలిపారు. ఎస్ టిఏ 4 సంవత్సరాల టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ద్వారా నేషనల్ కామన్ ఎంట్రస్స్ టెస్ట్ 2025-2026ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఫిబ్రవరి 28వ తేదీలోపు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News February 25, 2026
T20 WC: పాక్ సెమీస్ చేరాలంటే..

T20 WCలో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయిన పాక్‌కు సెమీస్ చేరడానికి రెండు అవకాశాలు ఉన్నాయి. మొదటిది శ్రీలంకపై పాక్ కచ్చితంగా గెలవాలి. అదే సమయంలో న్యూజిలాండ్‌ను శ్రీలంక, ఇంగ్లాండ్ ఓడించాలి. అప్పుడు పాక్ మూడు పాయింట్లతో సెమీస్ చేరుతుంది. ఇక రెండోది న్యూజిలాండ్ తన మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఒక్కటే గెలిస్తే శ్రీలంకపై పాక్ భారీ తేడాతో గెలిచి కివీస్ కంటే మెరుగైన నెట్ రన్ రేట్ సాధించాలి.
News February 25, 2026
జర్మనీలో ఉద్యోగ అవకాశాలు

తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM) ద్వారా జర్మనీలో ఎలక్ట్రీషియన్ విభాగంలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి బి.సాత్విక తెలిపారు. ఐటీఐ విద్యార్హతతో పాటు రెండేళ్ల అనుభవం ఉన్న 19-30 ఏళ్ల యువకులు దీనికి అర్హులు అని అన్నారు. ఈనెల 27వ తేదీన హనుమకొండలోని ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో జరిగే అవగాహన సదస్సుకు హాజరై పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఆమె కోరారు.
News February 25, 2026
రష్యా-ఉక్రెయిన్ ‘కాల్పుల విరమణ’పై ఓటింగ్‌కు భారత్ దూరం

రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి నాలుగేళ్లు పూర్తైన వేళ కాల్పుల విరమణ తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ప్రవేశపెట్టారు. దీనిపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. ఉక్రెయిన్ ప్రతిపాదించిన ఈ తీర్మానానికి 107 దేశాలు మద్దతు తెలపగా, భారత్, చైనా సహా 51 దేశాలు ఓటింగ్‌లో పాల్గొనలేదు. అంతర్జాతీయ చట్టాలకు లోబడి శాంతిని నెలకొల్పాలని, యుద్ధ ఖైదీలను విడుదల చేయాలని ఈ తీర్మానం కోరింది.


