News March 17, 2025
లక్షెట్టిపేట: పుస్తెల తాడు తెంపుకెళ్లిన మహిళ

లక్షెట్టిపేటలోని గోదావరి రోడ్డుకు చెందిన కొత్త శ్యామల మెడలో ఉన్న 3 తులాల పుస్తెల తాడును ఓ మహిళ లాక్కుని పరారైనట్లు ఎస్ఐ సతీశ్ తెలిపారు. ఆదివారం శ్యామల ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించి ఓ మహిళ ఇంట్లోకి చొరబడి శ్యామల కళ్లల్లో కారం కొట్టి బాత్రూమ్కు లాక్కెళ్లి పుస్తెల తాడు తెంపుకొని పారిపోయింది. కాగా శ్యామల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.
Similar News
News December 3, 2025
శ్రీకాకుళం: కొండెక్కిన టమాటాల ధర

శ్రీకాకుళం మార్కెట్లో టమాటా ధరలు చుక్కలు తాకుతున్నాయి. ప్రస్తుతం కిలో 70 రూపాయలు పలుకుతోంది అక్టోబర్, నవంబర్ నెలలలో కిలో టమాటాల ధర సగటున రూ.30 నుంచి రూ.50కు పెరిగినట్లు వినియోగదారులు చెబుతున్నారు. ఈ నెలలో ఇప్పటికీ 70 రూపాయలుగా ఉందని, ఇది ₹100 దాటవచ్చని అంటున్నారు. అధిక వర్షపాతంతో దిగుబడి తగ్గడంతోపాటు అయ్యప్ప దీక్షల కారణంగా టమాటాకు డిమాండ్ పెరిగిందంటున్నారు. మీ ఏరియాలో ధర ఎంతో కామెంట్ చేయండి.
News December 3, 2025
ధోనీ రూమ్లో చాలా చేసేవాళ్లం: మైక్ హస్సీ

క్రికెట్ మైదానంలో ఎంతో ప్రశాంతంగా ఉండే ధోనీ ఆఫ్ఫీల్డ్లో ఎలా ఉంటారో CSK మాజీ ఆటగాడు, కోచ్ హస్సీ వెల్లడించారు. ప్రతి IPL సీజన్లో ధోనీ రూమ్ అనధికారిక టీమ్ లాంజ్లా మారేదన్నారు. ప్లేయర్లు 24 గంటలూ అక్కడే మాట్లాడుకోవడం, ఫుడ్ షేర్ చేసుకోవడం, కొందరు హుక్కాతో రిలాక్స్ అవ్వడం జరిగేదన్నారు. ఇటువంటి బాండింగ్ కారణంగానే CSK ఒక కుటుంబంలా మారిందని అభిప్రాయపడ్డారు.
News December 3, 2025
కర్నూలు: మరణంలోనూ వీడని బంధం

కర్నూలు జిల్లా కోసిగి మండలం దొడ్డి బెళగల్ గ్రామంలో వృద్ధ దంపతులు వీరన్న, పార్వతమ్మ ఒకరికొకరు తోడుగా ఉంటూ జీవించేవారు. అయితే వయస్సు మీద పడటంతో పాటు అనారోగ్యం తోడు కావడంతో వీరన్న నిన్న రాత్రి మృతి చెందాడు. ఆ మరణ వార్తను జీర్ణించుకోలేక భార్య పార్వతమ్మ కూడా బుధవారం ఉదయం మృతి చెందారు. ఎంతో అన్యోన్యంగా ఉండే దంపతులు గంటల వ్యవధిలోనే మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


