News April 22, 2025

లక్షెట్టిపేట: యాక్సిడెంట్.. ఒకరి మృతి

image

లక్షెట్టిపేట మండలంలోని ఎల్లారం గ్రామ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ మునుగంటి చంద్రశేఖర్(51) మృతి చెందాడని ఎస్సై సురేశ్ తెలిపారు. చంద్రశేఖర్ ఆదివారం మధ్యాహ్నం పౌరోహిత్యం ముగించుకొని వెంకట్రావుపేటకు వెళ్లే క్రమంలో ఎల్లారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారన్నారు. ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు చెప్పారు.

Similar News

News April 22, 2025

ఇంటర్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా ఫస్ట్

image

ఇంటర్ ఫలితాల్లో మన మేడ్చల్ జిల్లా సత్తాచాటింది. ఫస్టియర్‌లో 77.21 శాతంతో రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిచింది. మొత్తం 68,650 మంది పరీక్ష రాశారు. ఇందులో 53,003 మంది పాస్ అయ్యారు. సెకండియర్‌లోనూ విద్యార్థుల హవా కొనసాగింది. 62,539 మంది పాస్ పరీక్ష రాయగా.. 48,726 మంది ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్‌లో 77.91 శాతంతో మేడ్చల్ జిల్లా మూడవ స్థానంలో నిలిచింది.

News April 22, 2025

VZM: రేపే పది ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో..!

image

రేపు ఉ.10 గంటలకు పదో తరగతి పరీక్షా ఫలితాలు ప్రకటించనున్నారు. విజయనగరం జిల్లాలో 2,359 పాఠశాలల నుంచి 23,765 మంది పరీక్ష రాయగా వారిలో 12,504 మంది బాలురు, 11,711 మంది బాలికలు ఉన్నారు. రెగ్యులర్ విద్యార్థులు 22,930 మంది కాగా ప్రైవేట్‌గా 835 మంది పరీక్ష రాశారు. మొత్తం 119 సెంటర్లలో పరీక్షలను నిర్వహించారు. ఒక్క క్లిక్‌తో వే2న్యూస్‌లో ఫలితాలను సులభంగా తెలుసుకోవచ్చు. >Share it

News April 22, 2025

కడప: నాగాలాండ్‌కు బదిలీ అయిన యువజన అధికారి

image

ఉమ్మడి కడప జిల్లా నెహ్రూ యువ కేంద్ర యువజన అధికారిగా విధులు నిర్వహిస్తున్న మణికంఠ కడప నుంచి నాగాలాండ్ రాష్ట్రానికి బదిలీ అయ్యారు. జిల్లాలో ఐదు సంవత్సరాల పాటు సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించడం గర్వంగా ఉందని ఆయన అన్నారు. బదిలీపై వెళుతున్న మణికంఠను స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు, వాలంటీర్లు ఘనంగా సన్మానించారు.

error: Content is protected !!