News February 21, 2025
లక్ష్మణచందా: విద్యార్థులకు అవగాహన కల్పించిన డీఈవో

లక్ష్మణచందా ప్రభుత్వ ఉన్నత పాఠశాలను డీఈఓ రామారావు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. పరీక్షలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వారి పలు అనుమానాలను నివృత్తి చేశారు. కష్టపడి చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని సూచించారు.
Similar News
News December 9, 2025
చిత్తూరు: 12న అంగన్వాడీల ఆందోళన

అంగన్వాడీల డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 12వ తేదీ చిత్తూరు కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని యూనియన్ లీడర్ సరస్వతి తెలిపారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని పులిచెర్లలో సీడీపీవోకు అందజేశారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, పథకాలు అమలు చేయాలని, సీనియార్టీ ప్రకారం ప్రమోషన్లు, జీతాలు పెంచాలని, మెడికల్ లీవ్ ఇవ్వాలని, పిల్లలకు సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలని కోరారు.
News December 9, 2025
32,479 సంఘాలకు రుణం ఇవ్వాలి: బాపట్ల కలెక్టర్

పొదుపు మహిళలు జిల్లాలో అధికంగా ఉన్నందున 32,479 సంఘాలకు రుణం ఇవ్వాలని కలెక్టర్ వినోద్ కుమార్ మంగళవారం చెప్పారు. 10,957 సంఘాలకు రుణాలు మంజూరు కాగా, ప్రస్తుతం 3,979 సంఘాలకు మాత్రమే రూ.604.02 కోట్ల రుణాలు ఇవ్వడం ఏమిటని ఆరా తీశారు. పొదుపు మహిళలకు అధికంగా రుణ సదుపాయం కల్పించాల్సి ఉండగా, ఆశించిన స్థాయిలో రుణాలు ఇవ్వకపోవడపై ధ్వజమెత్తారు.
News December 9, 2025
NGKL: లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన ఏఈ

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల ఇన్చార్జి ఏఈ వెంకటేష్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు మంగళవారం పట్టుబడ్డాడు. చొక్కన్నపల్లి గ్రామానికి చెందిన రైతు వద్ద రూ.20 వేలు డిమాండ్ చేసి, రూ.15 వేలు తీసుకుంటుండగా అధికారులు దాడులు నిర్వహించి పట్టుకున్నారు. కల్వకుర్తి ప్రాంతంలో వరుస ఏసీబీ దాడులు జరుగుతున్నా అధికారుల తీరులో మార్పు రావడం లేదని స్పష్టమవుతోంది.


