News July 13, 2024

లక్ష్మణచందా: సరస్వతీ కెనాల్ పై కూలిన బ్రిడ్జి

image

లక్ష్మణచందా మండలంలోని వడ్యాల్ సమీపంలో గల సరస్వతి కెనాల్ పై ఉన్న ఆయకట్ట బ్రిడ్జి గురువారం కుప్పకూలింది. కొన్ని సంవత్సరాల క్రితమే ఈ బ్రిడ్జి శిథిలావస్థకు చేరిన అధికారులు పట్టించుకోలేదు. ఇప్పుడు బ్రిడ్జి కూలిపోవడంతో ఆయకట్టు కింద ఉన్న రైతులు తమ పొలాలకు ఎలా వెళ్లి పండించుకోవాలని ప్రశ్నిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకొని త్వరగా కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.

Similar News

News November 18, 2025

ఆదిలాబాద్‌లో రేపటి నుంచి పత్తి కొనుగోళ్లు

image

బుధవారం నుంచి పత్తి కొనుగోళ్లు చేపట్టనున్నట్లు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. రాష్ట్ర జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ తలపెట్టిన బంద్‌ను విరమించుకున్న నేపథ్యంలో ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో సీసీఐ, ప్రైవేటు ద్వారా పత్తి కొనుగోళ్లు యథావిధిగా చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని రైతు సోదరులు గమనించాలని సూచించారు.

News November 18, 2025

ADB: ఈ నెల 20న వయోవృద్ధుల దినోత్సవ వేడుకలు

image

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఈ నెల 20న వేడుకలను నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి మిల్కా పేర్కొన్నారు. ఈ వేడుకల్లో జిల్లాలోని వయోవృద్ధులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. డీఎంహెచ్ఓ, రిమ్స్ వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ఉదయం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

News November 18, 2025

ADB: ఉపకార వేతనం మంజూరుకై దరఖాస్తుల ఆహ్వానం

image

2025–26 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10 తరగతులు చదువుతున్న బీసీ విద్యార్థులు ఉపకార వేతనం కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి రాజలింగు తెలిపారు. అర్హులైన విద్యార్థులు http://telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా డిసెంబర్ 15 లోపు దరఖాస్తులు సమర్పించాలని కోరారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.