News July 13, 2024
లక్ష్మణచందా: సరస్వతీ కెనాల్ పై కూలిన బ్రిడ్జి

లక్ష్మణచందా మండలంలోని వడ్యాల్ సమీపంలో గల సరస్వతి కెనాల్ పై ఉన్న ఆయకట్ట బ్రిడ్జి గురువారం కుప్పకూలింది. కొన్ని సంవత్సరాల క్రితమే ఈ బ్రిడ్జి శిథిలావస్థకు చేరినా అధికారులు పట్టించుకోలేదు. ఇప్పుడు బ్రిడ్జి కూలిపోవడంతో ఆయకట్టు కింద ఉన్న రైతులు తమ పొలాలకు ఎలా వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకొని త్వరగా కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.
Similar News
News November 30, 2025
రెండో విడత నామినేషన్‌కు విస్తృత ప్రచారం కల్పించాలి: కలెక్టర్

నేటి నుంచి రెండో విడత పంచాయితీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో రిటర్నింగ్ అధికారులు ఫారం నంబర్ -1 నుంచి 10 వరకు ప్రతి అంశంపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు జారీ చేశారు. ప్రజల నుంచి ఎక్కువ నామినేషన్లు వచ్చే విధంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
News November 30, 2025
ఆదిలాబాద్ జిల్లాలో పంజా విసురుతున్న చలి

ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. 24 గంటల్లో నమోదైన వివరాలను అధికారులు వెల్లడించారు. నేరడిగొండ, అర్లిలో 10.3°C, పొచ్చెరలో 10.4°C, సోనాలలో 10.9°C, సాత్నాల, తలమడుగులో 11.2°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తాంసిలో 11.4°C, బేలలో 11.6°C, నార్నూర్‌లో 12.9°C, ఉట్నూర్‌లో 14.1°Cగా నమోదైంది. చలి తీవ్రత దృష్ట్యా పిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
News November 30, 2025
సిరికొండ: నలుగురు మహిళా సర్పంచ్‌లు ఏకగ్రీవం

సిరికొండ మండలంలో 7గ్రామ పంచాయతీల సర్పంచ్ అభ్యర్థులను గ్రామ పెద్దలు ఏకగ్రీవ తీర్మానం ద్వారా ఎన్నుకున్నారు. నేరడిగొండ (జి) క్లస్టర్‌లోని 4గ్రామపంచాయతీలకు నామినేషన్ నిర్వహించగా కుంటగూడ, జెండగూడ, నారాయణపూర్, నేరడిగోండ (జి)లో నలుగురు మహిళలను సర్పంచ్‌లుగా ఏకగ్రీవం చేశారు.


