News April 4, 2025
లక్ష్మణచాంద మండలం నిర్మల్ జిల్లాలోనే టాప్

ఇంటి పన్ను వసూళ్లలో లక్ష్మణచాంద మండలం నిర్మల్ జిల్లాలోనే అగ్రస్థానంలో నిలిచిందని ఎంపీడీఓ రాధారాథోడ్ గురువారం తెలిపారు. 99 శాతం ఇంటి పన్ను వసూలు చేసినందుకు ఎంపీఓ ఆమీర్ ఖాన్, ఆయ గ్రామ పంచాయతీ కార్యదర్శులను ఆమె అభినందించారు. ఇందుకు సహకరించిన లక్ష్మణచాంద మండల ప్రజలకు, వాణిజ్య సముదాయాలకు ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News December 17, 2025
ADB: 69 ఏళ్ల తర్వాత ఎన్నిక.. సర్పంచ్‌గా దేవురావు

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని బరంపూర్ GPకి 69 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరిగాయి. 1956లో ఎన్నికలు జరగగా తిరిగి ఈ సంవత్సరం సర్పంచ్ పదవికి ఇద్దరు అభ్యర్థులు పోటీ చేశారు. బరంపూర్ సర్పంచ్‌గా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి మెస్రం దేవురావు విజయం సాధించారు. సమీప కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి సిడం లక్ష్మణ్‌పై 300పైగా ఓట్లతో గెలుపొందారు.
News December 17, 2025
జనవరి నుంచి ‘ఈ-ఆఫీస్’ విధానం: జేసీ

ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత, వేగం కోసం జనవరి నుంచి పూర్తిస్థాయిలో ‘ఈ-ఆఫీస్’ విధానం అమల్లోకి రానుందని జాయింట్ కలెక్టర్ నిశాంతి తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇకపై అన్ని ప్రభుత్వ కార్యకలాపాలు ఆన్లైన్ ద్వారానే సాగుతాయన్నారు. అధికారులు, సిబ్బంది ఈ సాఫ్ట్వేర్ నిర్వహణపై పూర్తి అవగాహన పెంచుకోవాలని సూచించారు.
News December 17, 2025
ప్రజల ప్రాణాలతో CBN చెలగాటం: సజ్జల

AP: ప్రజల ప్రాణాలతో CM చంద్రబాబు చెలగాటం ఆడుతున్నారని వైసీపీ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఫైరయ్యారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో కోటి సంతకాల ప్రతులను పరిశీలించారు. పీపీపీ వెనుక పెద్ద స్కామ్ ఉందన్నారు. ప్రైవేటులో ఫ్రీగా వైద్యం ఎందుకు చేస్తారని ప్రశ్నించారు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి కోటి సంతకాల సేకరణలో పాల్గొన్నారన్నారు. ప్రభుత్వం చేసిన అప్పుల్లో కొంత ఖర్చు చేసినా కాలేజీలు పూర్తవుతాయన్నారు.


