News March 4, 2025

లక్ష్మణరావు 3సార్లు గెలిచి.. ఈసారి ఓడారు.!

image

గతంలో మూడు సార్లు ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలుపొందిన కేఎస్ లక్ష్మణరావుకు ఈసారి ఓటమి ఎదురైంది. ఈయన 2007, 2009లో కృష్ణ-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందారు. అయితే 2015 ఎన్నికల్లో పోటీ చేసి ఓడారు. తిరిగి 2019ఎన్నికల్లో గెలుపొందగా.. 2025లో ఓడారు. ఈయన గతంలో గుంటూరు హిందు కళాశాలలో లెక్చరర్‌గా పని చేశారు. నిరుద్యోగులకు తరగతులు చెప్తూ పేరుపొందారు. ఉపాధ్యాయుల వివిధ సమస్యలపైన పోరాడారు.

Similar News

News November 24, 2025

ధర్మేంద్ర చివరి సినిమా ఇదే

image

బాలీవుడ్‌ దిగ్గజం ధర్మేంద్ర 1960లో దిల్ భీ తేరా హమ్ భీ తేరేతో సినీ ప్రవేశం చేశారు. 1960-80 మధ్య స్టార్‌డమ్‌ సంపాదించారు. 300కి పైగా చిత్రాల్లో నటించిన ధర్మేంద్ర.. షోలే, పూల్ ఔర్‌ పత్తర్, చుప్కే చుప్కే వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాల్లో నటించారు. చివరిగా 2024లో తేరీ బాతోన్ మే ఐసా ఉల్జా జియాలో సినిమాలో కనిపించారు. ధర్మేంద్ర చివరి మూవీ ఇక్కీస్ విడుదల కావాల్సి ఉంది.

News November 24, 2025

చిత్తూరు జిల్లాలో నేటి టమాటా ధరలు

image

టమాటా ధరల పెరుగుదలతో రైతుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సోమవారం ధరలు ఇలా ఉన్నాయి. నాణ్యత కలిగిన టమాటా ధరలు మొదటి రకం 10 కిలోలు ములకలచెరువు- రూ.510, పుంగనూరు-రూ.100, పలమనేరు- రూ.480, వీకోట-రూ.500 వరకు ధర పలుకుతోంది. వర్షాల కారణంగా పంట తగ్గిపోవడంతోనే ధరలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

News November 24, 2025

పుట్టపర్తిలో ఉత్సవాలు బ్లాక్‌బస్టర్!

image

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఈనెల 13న మొదలై 23న విజయవతంగా ముగిశాయి. లక్షలాది మంది భక్తులు, రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు వేడుకల్లో పాల్గొని బాబాను స్మరించుకున్నారు. ఉత్సవాల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత కచేరీ, లేజర్ షో ఈవెంట్స్ భక్తులను మైమరపించాయి. జిల్లా అధికారులు, పోలీసులు, సాయి సేవాదళ్ సభ్యులు విశేష సేవలందించి శత జయంతిని సక్సెస్ చేశారు.