News March 4, 2025
లక్ష్మణరావు 3సార్లు గెలిచి.. ఈసారి ఓడారు.!

గతంలో మూడు సార్లు ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలుపొందిన కేఎస్ లక్ష్మణరావుకు ఈసారి ఓటమి ఎదురైంది. ఈయన 2007, 2009లో కృష్ణ-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందారు. అయితే 2015 ఎన్నికల్లో పోటీ చేసి ఓడారు. తిరిగి 2019ఎన్నికల్లో గెలుపొందగా.. 2025లో ఓడారు. ఈయన గతంలో గుంటూరు హిందు కళాశాలలో లెక్చరర్‌గా పని చేశారు. నిరుద్యోగులకు తరగతులు చెప్తూ పేరుపొందారు. ఉపాధ్యాయుల వివిధ సమస్యలపైన పోరాడారు.
Similar News
News March 4, 2025
మదనపల్లె: ఉద్యోగం పేరుతో మోసపోయిన అమ్మాయిలు

ఉద్యోగం పేరుతో ముగ్గురు అమ్మాయిలు మోసపోయిన ఘటన మదనపల్లెలో జరిగింది. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి(M)కి చెందిన ముగ్గురు అమ్మాయిలు డిగ్రీ చదివారు. వారికి మదనపల్లెలోని ఓ ప్రైవేట్ కంపెనీ జాబ్ ఆఫర్ చేసింది. రూ.18వేలు జీతం అని మాయమాటలు చెప్పారు. ఉద్యోగంలో చేరాలంటే రూ.45వేలు కట్టాలనడంతో నిర్వాహకులకు డబ్బులు చెల్లించారు. తీరా వారు జాబ్‌లో చేరిన తరువాత మోసపోయామని గ్రహించడంతో పోలీసులను ఆశ్రయించారు.
News March 4, 2025
నిజామాబాద్ నగరంలో కత్తిపోట్ల కలకలం

నిజామాబాద్ నగరంలో మంగళవారం కత్తిపోట్ల కలకలం చెలరేగింది. నగరంలోని గాజుల్ పేట్‌లో ఓ సంఘం సమావేశంలో జరిగిన పరస్పర వాదనలు కాస్తా కత్తిపోట్లకు దారితీశాయి. సంతోష్ అనే వ్యక్తిని ఒకరు కత్తితో పొడిచి గాయపరిచాడు. కత్తిపోట్లలో గాయపడిన క్షతగాత్రుడిని స్థానికులు హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 4, 2025
ఇంటర్ పరీక్షలు రాసేవారికి అలర్ట్

TG: రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉ.9 నుంచి మ.12 వరకు ఎగ్జామ్స్ ఉంటాయి. తప్పనిసరి పరిస్థితుల్లో 5 ని.లు ఆలస్యమైనా అనుమతిస్తామని అధికారులు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల అడ్రస్ విషయంలో గందరగోళానికి గురికాకుండా హాల్‌టికెట్లపై QR కోడ్ ముద్రించామని తెలిపారు. ఏవైనా సమస్యలు ఉంటే 9240205555కు కాల్ చేయాలని సూచించారు. 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
*ALL THE BEST STUDENTS