News April 5, 2025

లక్ష్మణ్‌చందా: సరస్వతి కెనాల్‌లో మృతదేహం

image

లక్ష్మణ్‌చందా మండలంలోని వడ్యాల్ గ్రామ సమీపంలోని సరస్వతి కెనాల్‌లో శనివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్ఐ జుబేర్ తెలిపారు. గ్రామస్థుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలియలేదని, ఎవరికైనా వివరాలు తెలిస్తే స్టేషన్‌లో సంప్రదించాలని ఎస్ఐ సూచించారు.

Similar News

News October 26, 2025

GNT: ‘మొంథా’ తుఫాన్.. స్కూల్ హాలిడేస్‌పై గందరగోళం

image

‘మొంథా’ తుఫాన్ కారణంగా జిల్లా వ్యాప్తంగా మూడు రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ తమిమ్ అన్సారియా ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రైవేట్ స్కూల్స్ నుంచి సమాచారం రాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కన్ఫ్యూజన్‌లో ఉన్నారు. ఈ సెలవు కేవలం ప్రభుత్వ పాఠశాలలకేనా లేక ప్రైవేటు విద్యా సంస్థలకు కూడా వర్తిస్తుందా అనే అయోమయంలో పడ్డారు.

News October 26, 2025

ప్రకాశం: తుఫాన్.. 3 రోజులు స్కూల్స్‌కు సెలవులు!

image

ప్రకాశం జిల్లాకు ముంథా తుఫాన్ కారణంగా 27, 28, 29 తేదీల్లో 3 రోజులపాటు అన్ని పాఠశాలలకు కలెక్టర్ రాజాబాబు సెలవులు ప్రకటించారు. తుఫాన్ కారణంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ ఆదివారం ప్రకటించారు. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలు వాగుల వద్దకు వెళ్లకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.

News October 26, 2025

ప్రకాశం: విద్యార్థులకే సెలవు.. టీచర్లు బడికి రావాల్సిందే!

image

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా రేపటినుంచి 3 రోజులపాటు పాఠశాలలకు తుఫాను కారణంగా సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఒంగోలులో DEO కిరణ్ కుమార్ మాట్లాడారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించడం జరిగిందన్నారు. కానీ <<18111249>>టీచర్లు<<>> విపత్కర పరిస్థితుల్లో సాయం అందించేందుకు విధులకు హాజరుకావాలన్నారు.