News May 17, 2024
లక్ష్మీనరసింహస్వామి ఆదాయం ఎంతంటే..?
సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శుక్రవారం రూ.1,59,135 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాల టికెట్లు అమ్మకం ద్వారా రూ.79,758 ప్రసాదం అమ్మకం ద్వారా రూ.65,245 అన్నదానం రూ.14,132 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.
Similar News
News January 27, 2025
కరీంనగర్: కార్పొరేషన్ ప్రత్యేకాధికారిగా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ నగరపాలక సంస్థ పాలకవర్గ పదవీకాలం ఈ నెల 28తో ముగియనుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకాధికారిగా కలెక్టర్ పమేలా సత్పతిని నియమించింది. ఆదివారం జమ్మికుంట, హుజురాబాద్, చొప్పదండి మున్సిపాలిటీల పాలకవర్గం పదవీకాలం ముగియడంతో ఆ మూడు మున్సిపాలిటీలకు అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ప్రపుల్ దేశాయ్‌ని నియమించింది.
News January 27, 2025
కాళేశ్వరం ఆలయ ఈఓ మారుతిపై వేటు
కాళేశ్వరం ఆలయంలో గత సోమవారం గర్భగుడి తలుపులు మూసేసి ప్రైవేట్ షూటింగ్ నిర్వహించడం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారి దుమారంలేపింది. భక్తులు, ప్రజా సంఘాల నేతలు పెద్ద ఎత్తున అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన దేవాదాయ శాఖ అధికారులు విచారణ చేపట్టి విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఆలయ ఈవో మారుతిపై వేటు వేస్తూ ఆలయ ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి తొలగిస్తూ దేవాదాయ శాఖ ఏడీసీ జ్యోతి ఉత్తర్వులు జారీ చేశారు.
News January 27, 2025
KNR: శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళలకు 59 రకాల పరీక్షలు: కలెక్టర్
మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల పరిధిలో శుక్రవారం సభ నిర్వహిస్తున్నామని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. మహిళల ఆరోగ్యం, పోషకాహార స్థితిని మెరుగుపరిచేందుకు, సామాజిక సమస్యలు పరిష్కరించేందుకు ఈసభ తోడ్పాటునిస్తుందన్నారు. జిల్లాలో ఆరోగ్య మహిళా కార్యక్రమం ద్వారా మహిళలకు రూ.50వేల విలువైన చేసే 59రకాల వైద్యపరీక్షలను ఉచితంగా చేయిస్తున్నామన్నారు.