News August 1, 2024
‘లక్ష్మీపార్వతికి గౌరవ ఆచార్యుల హోదా ఉపసంహరణ’
గతంలో తెలుగు అకాడమి ఛైర్పర్సన్‌గా బాధ్యతలను నిర్వహించిన ఎన్.లక్ష్మీపార్వతికి గౌరవ ఆచార్యుల హోదాను ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపసంహరించుకున్నట్లు ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య ఎన్.కిషోర్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఆమెకు ఇప్పటి వరకు ఎటువంటి వేతనం వర్సిటీ నుంచి చెల్లించలేదని స్పష్టం చేశారు. ఆమె వద్ద మార్గదర్శకం కోసం చేరిన పరిశోధకులను తెలుగు విభాగంలో మరొక ఆచార్యునికి మార్పు చేయాలని ఆదేశించారు.
Similar News
News October 14, 2024
విశాఖ: త్వరలో తెలుగులో వాతావరణం సమాచారం
వాతావరణ సమాచారాన్ని త్వరలో తెలుగులో అందించనున్నట్లు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం చీఫ్ భారతి తెలిపారు. త్వరలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఇంగ్లీష్ భాషలోనే వాతావరణం సమాచారాన్ని అందిస్తున్నామన్నారు. ఇకపై ఐఎండీ సూచనలకు అనుగుణంగా ప్రాంతీయ భాష తెలుగులో సమాచారాన్ని అందజేస్తామన్నారు. కైలాసగిరిపై ఏర్పాటుచేసిన డాప్లర్ రాడార్ ఆధునీకరణ పనులను త్వరలో ప్రారంభిస్తామన్నారు.
News October 14, 2024
విశాఖలో రూ.13 కోట్ల మద్యం విక్రయాలు
విజయదశమి సందర్భంగా ఆదివారం ఒక్కరోజు విశాఖ జిల్లాలో రూ.13 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. జిల్లాలో 139 ప్రభుత్వం మద్యం దుకాణాలతో పాటు 132 బార్‌లు ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు స్వల్పంగానే పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. మద్యం దుకాణాల్లో తగినంత స్టాక్ లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
News October 14, 2024
విశాఖ: 150 మద్యం షాపులకు 4139 దరఖాస్తులు
విశాఖ జిల్లాలో 150 మద్యం షాపులకు 4139 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈనెల 14 ఉదయం 8 గంటల నుంచి వుడా చిల్డ్రన్ ఎరీనాలో మద్యం షాపుల కేటాయింపుకు జరిగే లాటరీ ప్రక్రియ ఏర్పాట్లను ఆయన ఆదివారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దరఖాస్తులు అధికంగా రావడంతో ఎక్కువమంది పాల్గొనే అవకాశం ఉందన్నారు. ఇందుకు తగ్గట్టుగా ఎక్కువ కౌంటర్లు చేయాలని అధికారులను ఆదేశించారు.