News October 25, 2024
లక్ష్యాలను సాధించేందుకు సిద్ధంగా ఉండాలి: కడప కలెక్టర్
స్వర్ణాంధ్ర – 2047 లక్ష్యాలను సాధించేందుకు కార్యాచరణ ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ అన్నారు. రాయచోటి కలెక్టరేట్ నుంచి ఆయన అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాకు సంబంధించిన లక్ష్యాలను నిర్దేశించుకోవాలని, వాటిని చేరుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుని పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News November 11, 2024
కడప: నదిలో దిగి.. వేర్వేరు చోట్ల ఇద్దరు మృతి
కడప జిల్లాలో వేర్వేరు చోట్ల నదిలో దిగి ఇద్దరు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చెన్నూరు మండలం వాటర్ గండి వద్ద పెన్నా నదిలో పడి కడపకు చెందిన బిల్లపాటి బాబు మృతి చెందినట్లు CI పురుషోత్తమరాజు తెలిపారు. CKదిన్నె మండలం బుగ్గవంక డ్యామ్‌లో చేపల వేటకు వెళ్లి ఇప్పెంట గ్రామం యానాది కాలనీవాసి తాటిముక్కల అంకయ్య (54) మృతి చెందాడు. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 11, 2024
కడప జిల్లా MLAలు నేడు అసెంబ్లీలో ఏం మాట్లాడతారో.!
నేటి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు ఉమ్మడి కడప ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఎన్నికలు జరిగాక తొలి బడ్జెట్ సమావేశం కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఎన్నికలకు ముందు రోడ్ల సమస్యలు, యువతకు ఉద్యోగ కల్పన, పరిశ్రమలు, గండికోట అభివృద్ధి వంటి అంశాలపై ప్రస్తుతం ఎన్నికైన MLAలు హామీలు ఇచ్చారు. మరి వీటి అమలుకు నిధులు వచ్చేలా అసెంబ్లీలో చర్చిస్తారా? లేదా? వేచి చూడాలి. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.
News November 11, 2024
వేంపల్లె: రాష్ట్రస్థాయి రగ్బీ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
రాష్ట్రస్థాయి అండర్ – 14 రగ్బీ పోటీల్లో వేంపల్లె జిల్లా పరిషత్ ఉర్దూ పాఠశాల విద్యార్థులు అత్యంత ప్రతిభ చూపినట్లు ప్రధానోపాధ్యాయులు ప్రసాద్ తెలిపారు. కమలాపురంలో జరిగిన ఈ రగ్బీ పోటిల్లో బాలికల విభాగంలో బిందు మాధవి 2వ స్థానం, బాలుర విభాగంలో నూరుల్లా 3వ స్థానంలో రాణించినట్లు చెప్పారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో తమ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చూపడంతో హెడ్మాస్టర్, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.