News October 7, 2024

లక్ష్యాలు అధిగమించి మంచి పేరు తీసుకురండి: కలెక్టర్

image

ప్రభుత్వపరంగా నిర్ణీత లక్ష్యాలను సమన్వయంతో పూర్తిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ DK బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ప్రభుత్వ శాఖ జిల్లా అధికారి వారి పరిధిలో ప్రతిరోజు లేదా 2రోజులకు ఒకసారి తప్పనిసరిగా వారి కార్యకలాపాలను సమీక్షించు కోవాలన్నారు.

Similar News

News October 7, 2024

అభివృద్ధిలో మరో ముందడుగు పడింది: MLA సుజనా

image

NDA ప్రభుత్వ పాలనలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టుతో రాష్ట్ర మౌలిక వసతుల అభివృద్ధిలో మరో ముందడుగు పడిందని విజయవాడ పశ్చిమ MLA సుజనా ట్వీట్ చేశారు. రూ.25 వేల కోట్ల భారీ పెట్టుబడితో ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం త్వరలో ప్రారంభం కానుందని సుజనా తెలిపారు. ఈ ప్రాజెక్టుతో రాజధాని నుంచి సమీప జిల్లాలలో ప్రాంతీయ ప్రగతి మరింత పెరగనుందని ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు.

News October 7, 2024

కృష్ణా: డిప్లొమా పరీక్షల టైంటేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో ఫుడ్ ప్రొడక్షన్, సైకలాజికల్ గైడెన్స్ &కౌన్సెలింగ్‌లో డిప్లొమా కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన ఇయర్ ఎండ్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు ఈ నెల 27 నుంచి నవంబర్ 1 మధ్య నిర్ణీత తేదీలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.

News October 7, 2024

8న విజయవాడలో జాబ్ మేళా

image

విజయవాడ పట్టణ పరిధిలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ పాలిటెక్నక్ కాలేజీ శిక్షణా కేంద్రంలో ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారి శ్రీనివాస్ రావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 10 నుంచి పీజీ వరకు చదివి 18-35 సంవత్సరాలలోపు వారు అర్హులని చెప్పారు. ఎంపికైన వారికి రూ.10 నుంచి రూ.40వేల వరకు వేతనం ఉంటుందన్నారు.