News February 15, 2025
లక్ష్యాల సాధనలో కోనసీమ జిల్లాకు 17వ ర్యాంక్

ప్రభుత్వ లక్ష్యాల సాధనలో డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పూర్ పెర్ఫార్మెన్స్తో లీస్టులో నిలిచింది. జిల్లాకు 200కు 105 పాయింట్లు లభించాయి. దీనితో 17వ స్థానంతో సరిపెట్టుకుంది. 14 అంశాలను ప్రాతిపదికగా తీసుకుని జిల్లాల వారీగా ప్రభుత్వం ర్యాంకులు ప్రకటించింది. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛఆంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ప్రగతి ఆధారంగా సీఎం చంద్రబాబు ర్యాంకులు ఇచ్చారు.
Similar News
News December 21, 2025
ప.గో మీ పిల్లలకు ఈ చుక్కలు వేయించారా?

ప.గో, ఏలూరు జిల్లాలో ఆదివారం ఉదయమే పల్స్ పోలియో కార్యక్రమం మొదలైంది. ఆరోగ్య కార్యకర్తలు తమకు కేటాయించిన శిబిరాలకు చేరుకున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకు వచ్చి పోలియో చుక్కలు వేయిస్తున్నారు. ఐదేళ్లలోపు చిన్నారులకు ప్రభుత్వ ఆసుపత్రి, బస్టాండ్, మెయిన్ సర్కిళ్ల వద్ద చుక్కలు వేస్తున్నారు. మీ పిల్లలకూ చుక్కలు వేయించారా? లేదా?
News December 21, 2025
VJA: బీటెక్ విద్యార్థులకు అలర్ట్.. జనవరి 21 నుంచి పరీక్షలు

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ(ANU) పరిధిలోని కాలేజీలలో బీటెక్ చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ, 2వ ఏడాది రెగ్యులర్ & సప్లిమెంటరీ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు 2026 జనవరి 21 నుంచి నిర్వహిస్తామని..ఈ పరీక్షలు రాసే విద్యార్థులు ఎలాంటి ఫైన్ లేకుండా ఈ నెల 29లోపు, రూ.100 ఫైన్తో 30లోపు ఫీజు చెల్లించాలని ANU సూచించింది. వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ చూడాలని కోరింది.
News December 21, 2025
కృష్ణా: పరీక్షల షెడ్యూల్ విడుదల

కృష్ణా యూనివర్శిటీ పరిధిలోని కాలేజీలలో బీఈడీ, స్పెషల్ బీఈడీ చదివే విద్యార్థులు రాయాల్సిన 1st సెమ్ (2023, 24, 25 బ్యాచ్లు) థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు 2026 జనవరి 31 నుంచి నిర్వహిస్తామని..పరీక్షలు రాసే విద్యార్థులు ఎలాంటి ఫైన్ లేకుండా 2026 జనవరి 19లోపు, రూ.200 ఫైన్తో 21లోపు ఫీజు చెల్లించాలని KRU పరీక్షల విభాగం సూచించింది. వివరాలకు https://kru.ac.in/ అధికారిక వెబ్సైట్ చూడవచ్చు.


