News February 15, 2025

 లక్ష్యాల సాధనలో కోనసీమ జిల్లాకు 17వ ర్యాంక్

image

ప్రభుత్వ లక్ష్యాల సాధనలో డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పూర్ పెర్ఫార్మెన్స్‌తో లీస్టులో నిలిచింది. జిల్లాకు 200కు 105 పాయింట్లు లభించాయి. దీనితో 17వ స్థానంతో సరిపెట్టుకుంది. 14 అంశాలను ప్రాతిపదికగా తీసుకుని జిల్లాల వారీగా ప్రభుత్వం ర్యాంకులు ప్రకటించింది. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛఆంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ప్రగతి ఆధారంగా సీఎం చంద్రబాబు ర్యాంకులు ఇచ్చారు.

Similar News

News April 17, 2026

‘గరుడ’ విష్ణుమూర్తి వాహనం ఎలా అయ్యాడు?

image

వినత కుమారుడైన గరుడుడు తన తల్లిని బానిసత్వం నుంచి విడిపించడానికి కద్రువ కోరిక మేరకు దేవలోకం నుంచి అమృతాన్ని తెస్తాడు. అపారమైన శక్తి ఉన్నా, అమృతంపై ఆశ పడడు. తల్లి కోసం నిస్వార్థంగా పనిచేసిన ఆయన ధైర్యం మహావిష్ణువును మెప్పించాయి. దీంతో విష్ణుమూర్తి, అతనికి చిరంజీవిత్వం ప్రసాదించి తన వాహనంగా, ధ్వజంగా స్వీకరించారు. గరుడుడు సముద్రాలను దాటగలడు. వేగవంతుడు. విష్ణు సాయం కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు.

News April 17, 2026

జగిత్యాల వ్యవసాయ మార్కెట్ ధరలు ఇలా..!

image

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో గురువారం పసుపు (పిల్ల కొమ్ము) గరిష్ఠ ధర రూ.12,400, కనిష్ఠ ధర రూ.8,000గా నమోదైంది. పసుపు (మండ కొమ్ము) గరిష్ఠ ధర రూ.11,655, కనిష్ఠం రూ.8,000 ఉండగా, కందులు రూ. 6,768, చిక్కుడు రూ. 4,611, వరి (1010) రూ. 1,752 చొప్పున పలికాయి. మొక్కజొన్న గరిష్ఠ ధర రూ. 1,857 కనిష్ఠ ధర రూ. 1,801గా పలికాయని మార్కెట్ అధికారులు. మార్కెట్‌కు ఈరోజు మొత్తం 652 క్వింటాళ్ల కొనుగోళ్లు జరిగాయన్నారు.

News April 17, 2026

మెట్‌పల్లి మార్కెట్లో పసుపు ధరలు ఇలా..!

image

మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌లో గురువారం పలికిన పసుపు ధరలు ఇలా ఉన్నాయి. పసుపు కాడి క్వింటాల్ గరిష్ఠ ధర రూ. 14,516, కనిష్ఠం రూ. 9,009, పసుపు గోళ గరిష్ఠం రూ. 13,566, కనిష్ఠం రూ. 8,585, పసుపు చూర గరిష్ఠం రూ. 11,555, కనిష్ఠం రూ. 8,181గా పలికాయి. ఈ రోజు మార్కెట్‌కు మొత్తం 956 క్వింటాళ్ల పసుపు అమ్మకానికి వచ్చిందని మార్కెట్ అధికారులు తెలిపారు.