News November 12, 2024

లగచర్లలో ప్రభుత్వ తీరు అమానుషం: హరీశ్ రావు

image

వికారాబాద్ జిల్లా <<14585618>>లగచర్లలో<<>> 300 మంది పోలీసులు మోహరించి స్థానికులను అరెస్టు చేయడం దారుణమని సిద్దిపేట MLA హరీశ్ రావు మండిపడ్డారు. ‘ఫార్మా భూసేకరణకు నిరాకరించిన గ్రామస్థులపై అర్ధరాత్రి పోలీసులతో దమనకాండ సరికాదు. ప్రజాభిప్రాయం తీసుకోకుండా భూసేకరణ చేపట్టడం వెనుక ఉన్న రేవంత్ రెడ్డి ఉద్దేశం తెలియాలి. వెంటనే ఈ భూసేకరణ ఆపాలి. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలి’ అని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు.

Similar News

News December 13, 2024

HYD: అలా చేస్తే ఉద్యమం తప్పదు..హెచ్చరిక!

image

రాష్ట్రంలోని డిప్యూటీ సర్వేయర్ పోస్టులకు వీఆర్వోలను కేటాయిస్తే ఉద్యమం తప్పదని HYD నగరంలో సివిల్ ఇంజినీర్లు, సర్వేయర్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పోస్టుకు అర్హత లేని వీఆర్వోలను ప్రభుత్వం కేటాయిస్తుందన్న సమాచారంతో అభ్యర్థులు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు. డిప్యూటీ సర్వేయర్ నోటిఫికేషన్ విడుదల చేసి, ఖాళీలు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

News December 13, 2024

HYD: పండుగలా నిర్వహించండి: కలెక్టర్‌

image

సంక్షేమ వసతి గృహాల్లో డైట్, కాస్మోటిక్‌ ఛార్జిల పెంపు ప్రారంభోత్సవ కార్యక్రమం పండగ వాతావరణంలో నిర్వహించాలని హైదరాబాద్‌ కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. గురువారం డైట్, కాస్మోటిక్‌ ఛార్జీలు 40% పెంపు ప్రారంభోత్స ఏర్పాట్లపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లా అధికారులు, ఆర్డీవోలతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.

News December 13, 2024

ట్రాన్స్‌పోర్ట్, నాన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డ్రైవర్లకు భద్రత కల్పించండి

image

మరణించిన ఆటోడ్రైవర్లు, ట్రాన్స్‌పోర్ట్, నాన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డ్రైవర్లకు సామాజిక భద్రత బీమా పథకం రెన్యువల్‌తోపాటు, వారి కుటుంబాలకు అందించే రూ.5 లక్షలను రూ.10 లక్షలకు పెంచాలని INTUC నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కోరారు. గురువారం మంత్రిని కలిసి ఈమేరకు వినతిపత్రాన్ని అందజేశారు. అలాగే ప్రమాదంలో అంగవైకల్యం చెందిన డ్రైవర్లకు రూ.3 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించాలని మంత్రిని కోరారు.