News December 1, 2024
లగచర్ల ఘటన.. శ్రీశైలంపై తెలంగాణ సీఎం కీలక వ్యాఖ్యలు

వికారాబాద్ జిల్లా లగచర్లలో ఇటీవల కలెక్టర్, అధికారులపై దాడి నేపథ్యంలో తెలంగాణ CM రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారుల మీద దాడులు చేయాల్సి వస్తే శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులు కట్టేవాళ్లా? అంటూ ‘రైతు పండుగ‘ కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘విపక్షాల ఉచ్చులో పడొద్దు.. కుటుంబాలు నాశనం చేసుకోవద్దు.. మహబూబ్‌నగర్ జిల్లాపై పగబట్టి అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారు’ అని అన్నారు.
Similar News
News February 8, 2026
కర్నూలులో రెసోనెన్స్.. సీమకు జాతీయ స్థాయి విద్య

రెసోనెన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కర్నూలులో ఫిబ్రవరి 7(శనివారం) ప్రారంభమైంది. కార్యక్రమానికి టీ.జీ. వెంకటేశ్, పద్మశ్రీ బ్రహ్మానందం, ఎంపీ బస్తిపాటి నాగరాజు హాజరై రెసోనెన్స్ 25 ఏళ్ల అకడమిక్ సేవలను ప్రశంసించారు. రాయలసీమ విద్యార్థులకు స్థానికంగా నాణ్యమైన విద్య, నిపుణుల మార్గదర్శకత్వం, క్రమశిక్షణతో కూడిన చదువు వాతావరణం లభిస్తే JEE/NEET వంటి పోటీపరీక్షల్లో గొప్ప విజయాలు సాధిస్తారని వారు తెలిపారు.
News February 8, 2026
వ్యర్థాల నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

కలెక్టరేట్‌లో వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ అంశాలపై మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిర్దేశాల ప్రకారం వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించాన్నారు. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలన్నారు. తడి చెత్తను సాంకేతిక పద్ధతి ద్వారా వ్యవసాయ ఎరువుగా మార్చాలన్నారు. డంపింగ్ యార్డులలో పేరుకుపోయి ఉన్న వ్యర్థాలను శుభ్రం చేయించాలన్నారు.
News February 7, 2026
రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యం: ఎస్పీ

రహదారి ప్రమాదాల నియంత్రణ లక్ష్యంగా ప్రతీ శనివారం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హెల్మెట్ ధరించడం తప్పనిసరి, ఓవర్ స్పీడ్, ఓవర్ లోడ్, డ్రంకెన్ డ్రైవ్ చేయరాదని తెలిపారు.


