News November 22, 2024
లగచర్ల ఘటన.. సీఎంకు నివేదిక అందజేత

వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు చేస్తున్నటువంటి స్టల సేకరణపై జరిగిన ఘటన గురించి లగచర్ల గ్రామ రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి వారికి కలిపించిన అవగాహన,వారి డిమాండ్లను శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నాగర్ కర్నూల్ MP మల్లు రవి, DCC అద్యక్షులు, పరిగి MLA డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి, అగ్రికల్చర్ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి నివేదిక అందించారు.
Similar News
News December 12, 2025
తొలి విడతలో RRలో 88.67% పోలింగ్ నమోదు

జిల్లాలోని 7 మండలాల్లో గురువారం తొలి విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉ. 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరిగింది. 2 గంటల నుంచి కౌంటింగ్, రాత్రి వరకు తుది ఫలితాలు వెల్లడించారు. ఎన్నికలు ముగిసే సమయానికి 88.67% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా కొత్తూరు మండలంలో 91.27% నమోదు కాగా అత్యల్పంగా 86.85% శంషాబాద్‌లో నమోదైంది.
News December 11, 2025
షాద్‌నగర్ MLA స్వగ్రామంలో BRS గెలుపు

షాద్‌నగర్ MLA స్వగ్రామం నందిగామ మండలంలోని వీర్లప్లలిలో BRS బలపరిచిన అభ్యర్థి గెలుపు ఢంకా మోగించారు. వీర్లపల్లి గ్రామ సర్పంచ్‌గా పాండు గెలుపు టాక్ ఆఫ్ ది నియోజకవర్గంగా మారింది. దీంతో బీఆర్ఎస్ నేతలు గ్రామంలో అంబరాన్నంటేలా సంబరాలు నిర్వహించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని వారు తెలిపారు. 21 పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.
News December 11, 2025
రంగారెడ్డిలో BRS vs కాంగ్రెస్

రంగారెడ్డి జిల్లాలో మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో నందిగామ, జిల్లేడ్ చౌదరిగూడం, కొత్తూరు మండలాలు బోణి కొట్టాయి. నందిగామ (M) బుగ్గోనితండా సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపరిచిన బుగ్గసాలయ్య, జిల్లేడ్(M) ముష్టిపల్లి సర్పంచ్‌గా BRS బలపరిచిన జంగయ్య గెలుపొందారు. దీంతో BRS, కాంగ్రెస్ మధ్య ఫైట్ టఫ్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది. అలాగే కొత్తూరు (M) మల్లాపూర్ తండా సర్పంచ్‌గా ఇండిపెండెంట్ మీనాక్షి దశరథ్ గెలుపొందారు.


