News January 29, 2025
లగచర్ల ఘటన.. సురేశ్‌కు బెయిల్ మంజూరు

దుద్యాల మండలం లగచర్లలో గతేడాది నవంబర్ 11న కలెక్టర్, పలువురు అధికారులపై జరిగిన దాడి ఘటనలో A-2గా ఉన్న సురేశ్‌కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మంగళవారం ఆయన చంచల్‌గూడ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. రూ.లక్ష పూచీకత్తుతో పాటు ప్రతీ సోమవారం బొంరాస్‌పేట PSలో హాజరుకావాలని షరతులు విధించింది.
Similar News
News October 28, 2025
చిత్తూరు: విద్యుత్ ఉద్యోగులకు సెలవులు లేవు

మొంథా తుఫాన్ కారణంగా చిత్తూరు డివిజన్ లో విద్యుత్ అధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని ఈఈ మునిచంద్ర సిబ్బందిని అదేశించారు. మరో రెండు రోజుల పాటు సెలవులు ఎవరికీ ఇవ్వడం జరగదని, సెలవుల్లో ఉన్నవారు కూడా విధులకు హాజరవ్వాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు.
News October 28, 2025
హెయిర్ డై వాడే ముందు ఇవి తెలుసుకోండి

జుట్టుకు రంగువేసుకోవడం వల్ల హార్మోన్ల అసమతౌల్యత, క్యాన్సర్ రావొచ్చని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. తప్పనిసరైతే తప్ప డై వాడకూడదంటున్నారు నిపుణులు. వీటిలో ఉండే అమోనియా, PPD, హైడ్రోజన్ పెరాక్సైడ్ తలలోని నేచురల్ ఆయిల్స్‌ని పొడిబారేలా చేస్తాయి. దీంతో జుట్టు రాలడం, పొడిబారడం, చిట్లడం వంటి సమస్యలు వస్తాయి. అలాగే సెన్సిటివ్ స్కిన్ ఉంటే దురద, అలెర్జీ, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయంటున్నారు.
News October 28, 2025
తుఫాను షెల్టర్లకు 534 మంది: మంత్రి నాదెండ్ల

ఏలూరు జిల్లాలో తుఫాను సహాయక చర్యలు ముమ్మరం చేశారు. జిల్లాలోని 27 సహాయక కేంద్రాలకు 534 మంది ప్రజలను తరలించామని ఇన్‌ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మొంథా తుఫానును ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం రాత్రి ఆయన మాట్లాడారు. 408 గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది వాస్తవ పరిస్థితులు తెలియజేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.


