News January 29, 2025
లగచర్ల ఘటన.. సురేశ్‌కు బెయిల్ మంజూరు

దుద్యాల మండలం లగచర్లలో గతేడాది నవంబర్ 11న కలెక్టర్, పలువురు అధికారులపై జరిగిన దాడి ఘటనలో A-2గా ఉన్న సురేశ్‌కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మంగళవారం ఆయన చంచల్‌గూడ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. రూ.లక్ష పూచీకత్తుతో పాటు ప్రతీ సోమవారం బొంరాస్‌పేట PSలో హాజరుకావాలని షరతులు విధించింది.
Similar News
News February 19, 2025
MUDA SCAM: సిద్దరామయ్యకు లోకాయుక్త క్లీన్‌చిట్

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ఊరట దక్కింది. ‘ముడా’ ల్యాండ్ స్కామ్ కేసులో ఆయనకు లోకాయుక్త క్లీన్‌చిట్ ఇచ్చింది. భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారని సిద్దరామయ్య, ఆయన సతీమణి పార్వతి తదితరులపై ఆరోపణలు వచ్చాయి. వీటికి ఎలాంటి ఆధారాల్లేవని తాజాగా లోకాయుక్త పోలీసులు వెల్లడించారు.
News February 19, 2025
పాకిస్థాన్‌లో రెపరెపలాడిన భారత జెండా

ఎట్టకేలకు పాకిస్థాన్‌లో భారత జెండా రెపరెపలాడింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడే అన్ని దేశాల పతాకాలు ఆతిథ్య దేశం స్టేడియాల్లో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ భారత మువ్వన్నెల పతాకాన్ని పాక్ క్రికెట్ బోర్డు విస్మరించింది. నిబంధనలు ఉల్లంఘించిన పాక్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో దిగొచ్చిన పీసీబీ ఇండియన్ ఫ్లాగ్‌ను ఇవాళ కరాచీలోని స్టేడియంపై ఏర్పాటు చేసింది.
News February 19, 2025
జగన్‌కు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేదు: షర్మిల

బడ్జెట్‌లో సూపర్ సిక్స్ పథకాలకు అగ్రభాగం నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని AICC చీఫ్ షర్మిల డిమాండ్ చేశారు. అన్ని పథకాలను ఈ ఏడాది నుంచే అమలు చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. అసెంబ్లీకి వెళ్లి పాలకపక్షాన్ని నిలదీసే ధైర్యం YS జగన్‌కు, YCP MLAలకు లేదని విమర్శించారు. ‘నేరస్థులను జైలుకెళ్లి పరామర్శించే సమయం ఉంటుంది కానీ.. ప్రజల కోసం అసెంబ్లీకి వెళ్లేందుకు మాత్రం మొహం చెల్లదు’ అని ట్వీట్ చేశారు.