News July 24, 2024
లబ్ధిదారుల ఎంపిక పకడ్బందీగా చేయాలి: కలెక్టర్

ఖమ్మం: ప్రభుత్వం మహిళా శక్తి కింద చేపట్టిన వివిధ కార్యక్రమాలకు లబ్ధిదారుల ఎంపిక పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని అధికారులతో మహిళా శక్తి కార్యక్రమ యూనిట్లపై సమీక్ష నిర్వహించారు. మండల వారిగా మహిళా శక్తి కార్యక్రమ కార్యాచరణ చేయాలన్నారు. ఇందులో భాగంగా ఆయా ప్రాంతంలో ఉన్న డిమాండ్ ను బట్టి యూనిట్ల ఎంపిక చేయాలన్నారు.
Similar News
News November 20, 2025
ఖమ్మం: పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధంగా ఉండాలి

గ్రామ పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి అధికారులు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసి, సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితా తయారీపై గురువారం ఆమె జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. HYD నుంచి జరిగిన ఈ సమీక్షలో ఖమ్మం కలెక్టర్ అనుదీప్, సీపీ సునీల్ దత్, అ.కలెక్టర్ శ్రీజ, తదితరులు పాల్గొన్నారు.
News November 20, 2025
ఖమ్మంలో 8 మిల్లులకు ధాన్యం ఇవ్వబోం: అ.కలెక్టర్

ఖమ్మం కలెక్టరేట్లో రైస్ మిల్లర్లతో అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి గురువారం సమావేశం నిర్వహించారు. నిబంధనలు పాటించే మిల్లర్లకే ఖరీఫ్ సీజన్ ధాన్యం కేటాయింపులు ఉంటాయని తెలిపారు. జిల్లాలోని 71మిల్లుల్లో 63మిల్లులు మాత్రమే బ్యాంకు గ్యారంటీలు సమర్పించాయని, మిగిలిన 8మిల్లులకు ధాన్యం ఇవ్వబోమని స్పష్టం చేశారు. పెండింగ్లో ఉన్న యాసంగి రైస్ డెలివరీ పూర్తి చేసిన తర్వాతే కేటాయింపులపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
News November 20, 2025
ఖమ్మం: నిరుద్యోగులకు ఫ్రీ కోచింగ్

ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగులకు CCTV ఇన్స్టాలేషన్, బ్యూటీషియన్ ఉచిత శిక్షణ ఏర్పాటు చేసినట్లు డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ శిక్షణలో వసతి, భోజన సౌకర్యాలు ఫ్రీగా కల్పిస్తామన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 30వ తేదీలోగా ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.


